ఖమ్మం సహకారనగర్: ఉద్యోగుల భవిష్యత్‌కు ముప్పుగా మారిన కాంట్రిబ్యూటరీ పింఛన్ స్కీం(సీపీఎస్)ను రద్దు చేసి పాత విధానాన్ని పునరుద్ధరించాని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్‌కుమార్ డిమాండ్ చేశారు. ఖమ్మంలోని సంఘం కార్యాలయంలో బుదవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా సీపీఎస్‌ను రద్దు చేయాలన్నారు. అంతేకాక పీఆర్సీని అమలు చేయాలని, ఐటీడీఏ పాఠశాలల్లో పండిట్ పీఈటీ పోస్టుల ను అప్‌గ్రేడ్, రెండేళ్ల సర్వీసు పూర్తయిన ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్‌పై దృష్టి సారించాలని కోరా రు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శులు విజయ్, పద్మ, నాయకులు మనోహర్‌రాజు, నాగిరెడ్డి, వెంగళరావు, వీరబాబు, శ్యాంసుందర్, వెంకటేశ్వర్లు, సంధ్యారాణి పాల్గొన్నారు.
టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్


