వ్యాక్సిన్లతో నవజాత శిశువులకు రక్షణ | - | Sakshi
Sakshi News home page

వ్యాక్సిన్లతో నవజాత శిశువులకు రక్షణ

Nov 19 2026 12:31 AM | Updated on Nov 19 2026 12:31 AM

బోనకల్‌/మధిర(చింతకాని): నవజాత శిశువులకు నిర్దేశిత సమయానికి వ్యాక్సిన్లు వేయడం ద్వారా వారి ఆరోగ్యాన్ని పరిరక్షించవచ్చని జిల్లా వ్యాక్సిన్‌ మేనేజర్‌ సీహెచ్‌వీ.రమణ తెలిపారు. బోనకల్‌, చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బుధవారం తనిఖీ చేసిన ఆయన గర్భిణులు, శిశువులకు వేయాల్సిన వ్యాక్సిన్లు, నిల్వలో జాగ్రత్తలపై సిబ్బందికి అవగాహ న కల్పించారు. శిశువుకు ముర్రుపాలు పట్టించడం, ఆరు నెలల వరకు తల్లి పాలు ఇవ్వడంతో పాటు సమయానికి టీకాలు వేయిస్తే ఆరోగ్యం సొంతమవుతుందనే అంశంపై బాలింతలకు అవగాహన కల్పిచా లని చెప్పారు. ఇలా చేయడం ద్వారా శిశు మరణాలను తగ్గించవచ్చని తెలిపారు. అలాగే, టీకా వేశా క పిల్లల ఆరోగ్య పరిస్థితి పరిశీలించాలని సూచించారు. వైద్యాధికారులు స్రవంతి, అల్తాఫ్‌, హెల్త్‌ సూపర్‌వైజర్‌ ఇస్మాయిల్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement