ఖమ్మంగాంధీచౌక్: జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా బుధవారం ఖమ్మంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన 150 మంది విద్యార్థులు పాల్గొనగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ ఖాదర్‌బాబా మాట్లాడారు. విద్యార్థులలో పుస్తక పఠనంపై ఆసక్తి పెంచడంతో పాటు రచనా నైపుణ్యాలు అభివృద్ధి చేసేలా పోటీలు నిర్వమించామని తెలిపారు. అనంతరం పలువురికి సభ్యత్వాలు అందజేశారు. పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమర్తపు మురళి, మాజీ కార్పొరేటర్లు పాకలపాటి శేషగిరి, రాపర్తి శరత్‌కుమార్, కన్నం ప్రసన్న, గజ్జెల వెంకన్న, దోన్వాన్ రవినాయక్, రుద్రగాని ఉపేందర్, నాయకులు మడూరి సైదారావు, బాలుసు లక్ష్మీనాగేశ్వరరావు తదితరులకు సభ్యత్వాలు అందజేయగా సంస్థ కార్యదర్శి పి.పద్మజ, ఉద్యోగులు పాల్గొన్నారు.


