మధిర(చింతకాని): మండలంలోని మత్కేపల్లి తుమ్మలమ్మ చెరువు కట్ట వద్ద గంజాయి విక్రయిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.5,3,250 విలువైన 1,065 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నామని ఎస్సై నరేష్ తెలిపారు. ఎస్సై, సిబ్బంది మంగళవారం రాత్రి పెట్రోలింగ్ చేస్తుండగా చెరువు కట్ట వద్ద ఐదుగురు అనుమానాస్పదంగా కనిపించారు. వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా గంజాయి విక్రయానికి సిద్ధంగా ఉన్నట్లు తేలింది. ఈమేరకు కొమ్ము ప్రణయ్, పెశెట్టి శ్రీశాంత్, మహ్మద్ అబ్దుల్ ఆదిల్, షేక్ అక్మల్, పెనుగొండ సాయిని అరెస్ట్ చేయగా, వీరికి గంజాయి సరఫరా చేస్తున్న టిన్ను అలియాస్ వినయ్, షఫీ, జావెద్, ఖాజా, శ్రీకాంత్, సాయిపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.
హైవే పనుల అడ్డగింత
రఘునాథపాలెం: నష్టపరిహారం చెల్లించకుండా జాతీయ రహదారి పనులు చేపట్టడానికి వీల్లేదని నిర్వాసిత రైతులు, ప్లాట్ల యజమానులు స్పష్టం చేశారు. ఈక్రమాన రఘునాథపాలెం వద్ద ఎన్‌హెచ్ అధికారులు డోజర్‌తో చేపడుతున్న పనులను బుధవారం అడ్డుకున్నారు. అలైన్‌మెంట్‌పై స్పష్టత ఇచ్చి, పరిహారం చెల్లించాలకే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాగా, నిర్వాసితులు అప్రమత్తంగా ఉండాలని నాయకులు కోరారు.


