సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందే... | - | Sakshi
Sakshi News home page

సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందే...

Nov 17 2026 12:20 AM | Updated on Nov 17 2026 12:20 AM

ముదిగొండ: ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట శాపంగా ఉన్న సీపీఎస్‌ విధానాన్ని తక్షణమే రద్దుచేయాలని టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్‌ డిమాండ్‌ చేశారు. ముదిగొండలో జరుగుతున్న జిల్లా మహాసభల్లో భాగంగా సోమవారం ఆయన మాట్లాడారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించడమే కాక పీఆర్‌సీని వెంటనే అమలుచేయాలని, పెండింగ్‌ బిల్లులు చెల్లింపునకు ప్రతీనెలా రూ.2వేల కోట్లు విడుదల చేయాలని కోరారు.

ఏకగ్రీవంగా జిల్లా నూతన కమిటీ

టీఎస్‌ యూటీఎఫ్‌ మహాసభల్లో జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా షేక్‌ రంజాన్‌, పారుపల్లి నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. అలాగే, ఉపాధ్యక్షులుగా బుర్రి వెంకన్న, షమీ, కోశాధికారిగా వల్లంకొండ రాంబాబు, కార్యదర్శులుగా రాందాస్‌, నర్సయ్య, నాగేశ్వరరావు, సురేష్‌, నిర్మలకుమారి, వలీ, ఉద్దండు, పద్మ, రామకృష్ట, కోటేశ్వరరావు, ఉమామహేశ్వరరెడ్డి, విజయ్‌, ప్రశాంతి శ్రీనివాసరావు, సుధాకర్‌ ఎన్నికయ్యారని వెల్లడించారు. ఈ సమావేశంలో నాయకులు నెల్లూరి వీరబాబు, పెనుబాక సురేష్‌, వల్లకొండ రాంబాబు, వాసం రాంబాబు, సుకాసి సుధాకర్‌రావు, విజయ్‌ పాల్గొన్నారు.

టీఎస్‌ యూటీఎఫ్‌

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement