ఖమ్మంక్రైం: ప్రజాసమస్యలు తెలుసుకుని పరిష్కరించేలా ప్రతీ సోమవారం నిర్వహించే గ్రీవెన్ డే(ప్రజాదివస్)లో భాగంగా పోలీసు కమిషనర్ సునీల్‌దత్ పలువురి నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా భూవివాదాలు, కుటుంబ, వ్యక్తిగత సమస్యలతో పాటు ఆర్థిక లావాదేవీలు, భార్యాభర్తల తగాదాలపై ఫిర్యాదులు అందాయి. వీటిని పరిశీలించి చట్టపరిధిలో పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
● వివిధ పోలీసుస్టేషన్లలో హెడ్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న ఐదుగురికి ఏఎస్సైలుగా పదోన్నతి లభించింది. పదోన్నతిపై వరంగల్ కమిషనరేట్‌కు వెళ్తున్న టి.కొండయ్య, టి.వెంకటేశ్వర్లు, వి.నరసింహారావు, హరిప్రసాద్, జయరాజును సీపీ సన్మానించారు. పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు హేమనాఽథ్ పాల్గొన్నారు.
● ఖమ్మం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌ను సీపీ సునీల్‌దత్ సోమవారం తనిఖీ చేసారు. ఈసందర్భంగా పెండింగ్ కేసులు, విచారణపై ఆరా తీసిన ఆయన స్టేషన్ నిర్వహణ, సెక్టార్ అధికారుల బాధ్యతలు, శాంతిభద్రతల పరిరక్షణపై సూచనలు చేశారు. ఏసీపీ రమణమూర్తి, సీఐ చిట్టిబాబు పాల్గొన్నారు.


