తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా సోమవారం సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఉప్పల శ్రీనివాసశర్మ భక్తులతో వ్రతం చేయించి పాటు వ్రత మహత్యాన్ని వివరించారు. అలాగే, సాయంత్రం కోనేరు వద్ద కార్తీక దీపోత్సవం, గంగా హారతి నిర్వహించారు. ఆలయ ఈఓ కొత్తూరు జగన్‌మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ఉప ప్రధాన అర్చకులు ఉప్పల మురళీమోహన్‌శర్మ ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. – ఎర్రుపాలెం


