ఖమ్మం మామిళ్లగూడెం: అవకాశవాదం, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కొందరు విభజన రాజకీయాలకు పూనుకున్నారని తెలంగాణ మున్నూరు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుండాల కృష్ణ విమర్శించారు. ఖమ్మంలో ఆదివారం తెలంగాణ ము న్నూరు కాపు సంక్షేమ సంఘం, మున్నూరు కాపు జేఏసీ సంయుక్త ఆధ్వర్యాన నిర్వహించిన వన సమారాధనలో ఆయన మాట్లాడారు. సంఘం అంటే భోజనాలు పెడితే సరిపోదని, కాపులకు ఆపద వచ్చినప్పుడు అండగా నిలబడాలని తెలిపారు. కాపు సంఘం అధ్యక్షుడిగా పని చేసిన మేకల సంగయ్య సంఘ సంక్షేమానికి ఆస్తులు కూడబెడితే, అవి ప్రస్తుతం కబ్జాలో ఉన్నాయని పేర్కొన్నారు.
అంబటి రాంబాబు మీ వాడే..
రాష్ట్రం రెండుగా విడిపోయినా అంబటి రాంబాబు ఎప్పటికీ ఇరు రాష్ట్రాల మున్నూరు కాపు కుటుంబీకుడేనని ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. వన సమారాధనలో ఆయన మాట్లాడుతూ తనపై గతంలో దాడి జరిగినప్పుడు తెలంగాణ నుంచి కూడా పలువురు కాపు కులస్తులు అండగా నిలిచారని తెలిపారు. అనంతరం సంపత్ తన గేయాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, వైఎస్సార్ సీపీ అవనిగడ్డ అధ్యక్షుడు కడవకొల్లు నరసింహారావు, కాపు సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బచ్చు విజయ్‌కుమార్, నాయకులు లక్కినేని రఘు, బచ్చు మధు, ఆకుల మూర్తి, పొన్నం వెంకటేశ్వర్లు, మూలగుండ్ల శ్రీహరి, పిన్ని కోటేశ్వరరావు, లక్కినేని సుధీర్, మడూరి సైదారావు, కనకం భద్రయ్య, రంగరాజు ఊర్మిళ, మాటేటి కిరణ్, ఎర్ర జ్ఞానేశ్, ఎర్ర అప్పారావు, రాపర్తి రాజా, నరాల నరేష్, తోట కనకారావు, తాడం మురళి, రాకం శ్యామ్, మాటేటి రామారావు, హరినాథ్ పాల్గొన్నారు. కాగా, గౌడ, పద్మశాలీ సంఘాల నాయకులు కత్తి నెహ్రూ గౌడ్, బొమ్మ రాజేశ్వరరావు సంఘీభావం తెలిపారు.
తెలంగాణ మున్నూరు కాపు
సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణ


