ముగిసిన రాష్ట్రస్థాయి జూడో టోర్నీ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన రాష్ట్రస్థాయి జూడో టోర్నీ

Nov 16 2026 12:08 AM | Updated on Nov 16 2026 12:08 AM

ఖమ్మం స్పోర్ట్స్‌/ఖమ్మం రూరల్‌: ఖమ్మం రూరల్‌ మండలం కామంచికల్‌లో రెండు రోజులుగా జరుగుతున్న సబ్‌ జూనియర్‌ రాష్ట్ర స్థాయి బాలబాలికల జూడో టోర్నీ ఆదివారం ముగిసింది. టోర్నీలో బాలుర చాంపియన్‌ సిప్‌ను రంగారెడ్డి జిల్లా క్రీడాకారులు దక్కించుకోగా, బాలికల విభాగంలో కరీంనగర్‌ టైటిల్‌ సాధించింది. విజేతలకు జూడో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బైరబోయిన కై లాస్‌ యాదవ్‌, జిల్లా కార్యదర్శి జల్లెల శ్రీనివాసరావు ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్‌ బొప్పి ప్రభాకర్‌రావు, నిర్వాహక కార్యదర్శి బానోత్‌ రవినాయక్‌తో పాటు పి.రామయ్య, అజీజ్‌ ఫారుఖీ, రవీందర్‌, డి.సంతోష్‌కుమార్‌, బి. సాయిరాం, అభినవ్‌, రాము, పార్విజ్‌, భరత్‌రెడ్డి, నక్షత్ర తదితరులు పాల్గొన్నారు. అనంతరం కామంచికల్‌ నుంచి వివిధ క్రీడల్లో జాతీయస్థాయికి ప్రాతినిధ్యం వహించిన పలువురు క్రీడాకారులను సన్మానించారు.

బాలురలో రంగారెడ్డి,

బాలికల్లో కరీంనగర్‌ చాంపియన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement