ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు ఖమ్మం రూరల్ మండలం కామంచికల్‌లో శనివారం ప్రారంభమయ్యాయి. పోటీలను జూడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బైరబోయిన కై లాస్‌యాదవ్ ప్రారంభించి మాట్లాడారు. చదువుతోపాటు క్రీడల్లో తర్ఫీదు పొందితే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం సాధ్యపడుతుందని తెలిపారు. జూడో క్రీడా ద్వారా శారరక, మానసిక దృఢత్వం పెంపొందించుకోవచ్చని చెప్పారు. అనంతరం గ్రామ సర్పంచ్ బొప్పి ప్రభాకర్‌రావు మాట్లాడగా తొలిసారి కామంచికల్‌లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తుండడం విశేషమన్నారు. వివిధ జిల్లాల నుంచి 250 మందికి పైగా క్రీడాకారులు హాజరుకాగా, అసోసియేషన్ బాధ్యులు, ప్రజాప్రతినిధులు సావిత్రి, అజీజ్ ఫరూఖీ, రవీందర్, పగడాల రామయ్య, బానోత్ రవినాయక్, సంతోష్‌కుమార్, అభినవ్, సాయిరాం, మనీషా, కుమారస్వామి, భరత్‌రెడ్డి, శరత్, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.


