కొణిజర్ల: మండలంలోని తుమ్మలపల్లి బీట్‌లో విద్యుత్ తీగలు అమర్చి వన్యప్రాణులను వేటకు యత్నించిన ఇద్దరిని అటవీ అధికారులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ సాల్మన్‌రాజు తెలిపిన వివరాలు... అటవీ ఉద్యోగులు శనివారం తెల్లవారు జామన తుమ్మలపల్లి బీట్ పరిధి అన్నవరంలో తనిఖీ చేస్తుండగా నల్లగుట్ట ప్రాంతం నుంచి బైక్‌పై వస్తున్న ఇద్దరు ఎదురుపడ్డారు. వీరిద్దరు అన్నవరం గ్రామానికి చెందిన వడిత్యా రమేష్, బానోత్ సాయికుమార్‌గా తేలడంతో తనిఖీ చేయగా వన్య ప్రాణులను వేటాడడానికి ఉపయోగించే విద్యుత్ తీగలు, కత్తులు, గడ్డపలుగు లభ్యమయ్యాయి. దీంతో సామగ్రిని స్వాధీనం చేసుకుని నిందితులను పోలీసులకు అప్పగించామని సాల్మన్‌రాజు తెలిపారు. తనిఖీల్లో ఉద్యోగులు అఫ్జల్, కన్నయ్య, రాంబాబు, శ్రీను పాల్గొన్నారు.


