ఎర్రుపాలెం: మండల కేంద్రంలోని జిల్లా పరి షత్, ప్రాథమిక పాఠశాలల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు గ్రామానికి చెందిన మాడపాటి ఎడ్యుకేషనల్ ట్రస్టు ఆధ్వర్యాన నగదు బహుమతులు అందజేశారు. పాఠశాలలో శనివారం 35మంది విద్యార్థులకు దాత మాడపాటి సరోజిని రూ.1.50లక్షల నగదు బహుమతులు అందచేసి అభినందించారు. ఎంఈఓ మురళీమోహన్‌రావు, హెచ్‌ఎం జీవీఎన్.రాజు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
నెలాఖరులోగా రేషన్ లబ్ధిదారుల ఈ–కేవైసీ
ఖమ్మంసహకారనగర్: జిల్లాలో రేషన్‌కార్డు లబ్ధిదారులకు సంబంధించి ఈ–కేవైసీ ప్రక్రియ చివరి దశకు చేరిందని జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్‌కుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 13,37,262 లబ్ధిదారులకు గాను ఇప్పటివరకు 84.27 శాతం ఈ–కేవైసీ పూర్తయిందని పేర్కొన్నారు. రేషన్ కార్డులో పేర్లు నమోదై, ఇంకా ఈ–కేవైసీ చేయించుకోని వారు ఈ నెలాఖరులోగా రేషన్ దుకాణాల్లో ప్రక్రియ పూర్తి చేయించుకోవాలని సూచించారు. డీలర్లు కూడా పెండింగ్ కార్డుదారులను గుర్తించి సమాచారం ఇవ్వాలని తెలిపారు. అంతేకాక మృతుల పేర్లను కార్డుల నుంచి తొలగించాలని డీసీఎస్‌ఓ ఓ ప్రకటనలో సూచించారు.
రేపటి నుంచి
కేయూ సెమిస్టర్ల పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, అదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ విద్యార్థులకు మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షలను ఈనెల 16నుంచి నిర్వమించనున్నారు. ఈమేరకు ఏర్పాట్లు చేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ తెలిపారు. మొదటి సెమిస్టర్ పరీక్షలకు 42,745మంది, మూడో సెమిస్టర్‌కు 32,917మంది, ఐదో సెమిస్టర్ పరీక్షలకు 25,464మంది విద్యార్థులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 42, అదిలాబాద్‌లో 46, ఖమ్మం జిల్లాలో 23 కేంద్రాలు ఏర్పాటుచేశామని తెలిపారు. మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 16, 18, 20, 23, 26, 30, డిసెంబర్ 2, 4వ తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతాయని తెలిపారు. మూడో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 17, 19, 21, 25, 27, డిసెంబర్ 1, 3, 5, 8వ తేదీల్లో ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, ఐదో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 16, 18, 20, 23, 26, 30, డిసెంబర్ 2, 4, 7వ తేదీల్లో ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు.
ముగిసిన
మత్స్యకారుల శిక్షణ
కూసుమంచి: పాలేరులోని మత్స్య పరిశోధన కేంద్రంలో నాలుగు జిల్లాల మత్స్య రైతులు, మత్స్యకారులకు ఇస్తున్న శిక్షణ శనివారం ముగిసింది. ఖమ్మంతో పాటు రాజన్నసిరిసిల్ల, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల మత్స్యకారులు పాల్గొనగా, ముగింపు సమావేశంలో మల్లాయిగూడెం సర్పంచ్ బి.నరేష్ సర్టిఫికెట్లు అందజేసి మాట్లాడారు. వ్యవసాయంపైనే ఆధారపడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుంటూ మత్స్య రంగంలోనూ అభివద్ధి సాధించాలని తెలిపారు. పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ జి.విద్యాసాగర్‌రెడ్డి, డాక్టర్ శ్యాం ప్రసాద్ మాట్లాడగా శాస్త్రవేత్తలు శాంతన్న, రవీందర్, దివ్య తదితరులు పాల్గొన్నారు.
న్యాయవాద ఫెడరేషన్ కార్యదర్శిగా రమేష్
ఖమ్మం లీగల్: న్యాయవాద ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యడ్లపల్లి రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రంగా రెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ హాల్‌లో శనివారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా విప్లవకుమార్‌రెడ్డి, కార్యదర్శిగా రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫెడరేషన్‌లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల బార్ అసోసియేషన్ల అధ్యక్ష, కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు, ఈమేరకు రమేష్ కార్యదర్శిగా ఎన్నికవడంపై బార్ కౌన్సిల్ చైర్మన్ సాముల రామ్‌రెడ్డితో పాటు మందడపు శ్రీనివాసరావు, మువ్యా నాగేశ్వరరావు, గొల్లపూడి రామారావు, ఇమ్మడి లక్ష్మీనారాయణ, మామిడి హన్మంతరావు, కాళ్లూరి లక్ష్మీనర్సింహారావు, కర్లపూడి శ్రీనివాసరావు, జయంతి హేమంత్ అభినందించారు.
దాడిలో తీవ్రగాయాలు
బోనకల్: మండలంలోని ముష్టికుంట్ల గ్రామంలో శనివారం రాత్రి ఓ యువకుడు కత్తితో తన సొంత బాబాయిపై దాడి చేశాడు. గ్రామానికి చెందిన సంగాపు నరేందర్ బాబాయి సంగాపు మోహన్‌రావుపై కత్తితో దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను 108లో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. మూడు రోజుల క్రితం నరేందర్‌ను మోహన్‌రావును కొట్టడంతో కోపం పెంచుకుని దాడికి పాల్పడినట్లు తెలిసింది.


