ఖమ్మం స్పోర్ట్స్: విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా యూనియన్ బ్యాంక్ ఖమ్మం రీజియన్ ఆధ్వర్యాన శనివారం క్రీడా పోటీలను నిర్వహించారు. పోటీలను రీజినల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కాటం వెంకట్‌రావు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అధికారి ఎన్.సుధాకర్‌రావు ప్రారంభించారు. నిత్యం విధుల్లో తలమునకలయ్యే ఉద్యోగుల్లో క్రీడలు ఉత్సాహాన్ని నింపుతాయని తెలిపారు. అనంతరం ఉద్యోగులకు వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం
ఖమ్మంగాంధీచౌక్: జాతీయ గ్రంథాలయ 59వ వారోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఖమ్మంలోని గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ ఖాదర్ బాబా మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానానికి నిలయాలని తెలి పారు. అన్నివర్గాల వారికి కావాల్సిన పుస్తకాలు సమకూరుస్తున్నామని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ నాయకుడు తుమ్మల యుగంధర్ మాట్లాడగా జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పద్మజ, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు దీపక్‌చౌదరి పాల్గొన్నారు.


