ఖమ్మం లీగల్: ఇటీవల జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికై న న్యాయవాదులను నవభారత యువ చైతన్య సమితి ఆధ్వర్యాన శనివారం ఖమ్మంలో సన్మానించారు. ఈ సందర్భంగా పూస మానస, కళంగి దేవ హనీశా, మంత్రిప్రగడ అనుదీప్‌ను సన్మానించగా సీనియర్ న్యాయవాదులు రామారావు, సంధ్యారాణి మాట్లాడారు. యువ న్యాయవాదులు వీరిని స్ఫూర్తిగా తీసుకుని కష్టపడి చదివి జడ్జిలుగా ఎంపిక కావాలని ఆకాంక్షించారు. బార్ అసోసియేషన్ కార్యదర్శి కొప్పుల రవితో పాటు బిచ్చాల తిరుమలరావు, జి.సత్యప్రసాద్, కళ్యాణి, క్రిస్టోఫర్, నేరెళ్ల శ్రీనివాస్, రాధమ్మ, పద్మావతి, తొండపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


