ఆధునిక భారత నిర్మాత నెహ్రూ | - | Sakshi
Sakshi News home page

ఆధునిక భారత నిర్మాత నెహ్రూ

Nov 15 2026 1:26 PM | Updated on Nov 15 2026 1:26 PM

ఖమ్మంమయూరిసెంటర్‌: తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆధునిక భారత నిర్మాణ శిల్పి అని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్‌ కొనియాడారు. నెహ్రూ జయంతి సందర్భంగా శనివారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించాక సత్యనారాయణ మాట్లాడారు. దేశ విముక్తి కోసం నెహ్రూ ఏళ్ల తరబడి జైలు జీవితం గడిపారని గుర్తుచేశారు. కులమతాలకు అతీతంగా అందరికీ సమాన హక్కులు, సామాజిక న్యాయం దక్కాలని ఆకాంక్షించారని తెలిపారు. నాడే ప్రతిష్ఠాత్మక ఐఐటీ వంటి విద్యాసంస్థలకు పునాదులు వేశారని, రైతుల సంక్షేమం కోసం భారీ ప్రాజెక్టులను నిర్మించారని చెప్పారు. కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్‌చౌదరి, సుడా చైర్మన్‌ పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, నాయకులు గజ్జెల్లి వెంకన్న, కొత్తా సీతారాములు, దొబ్బల సౌజన్య, మొక్క శేఖర్‌గౌడ్‌, ముజాహిద్‌ హుస్సేన్‌, ఆసిఫ్‌ అలీ, గ్రంధి ప్రవీణ్‌, కిలారు అనిల్‌, కొట్టే రాజశేఖర్‌, గాదెల ఝాన్సీ, బండి మాధవరావు, బచ్చలకూరి నాగరాజు పాల్గొన్నారు.

డీసీసీ కార్యాలయంలో మాజీ ప్రధాని జయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement