ఖమ్మం సహకారనగర్: రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్‌గా ఇటీవల ఎన్నికై న డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు(జీ.వీ.) హైదరాబాద్ రాజ్‌భవన్‌లో శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే కార్యక్రమంలో కొల్లా రవీంద్ర రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా జీ.వీ. చేపట్టిన వైద్య, సేవా కార్యక్రమాలను గవర్నర్ శివప్రతాప్ శుక్లా అభినందించారు.
‘చేయూత’ అందించరూ...
కామేపల్లి: కుడి కన్ను కోల్పోయి చూపు లేక, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న చిన్నారికి ప్రభుత్వ చేయూత అందడం లేదు. మండలంలోని జాస్తిపల్లికి చెందిన మేకల కార్తీక్ కుడి కన్ను పూర్తిగా కోల్పోయాడు. ఆయనకు దివ్యాంగుల కోటా కింద చేయూత పెన్షన్ కోసం కుటుంబీకులు దరఖాస్తు సమర్పించారు. పెన్షన్ మంజూరైతే ఆసరాగా నిలుస్తుందని భావిస్తుండగా, తాజా జాబితాలో కార్తీక్ పేరు లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. అధికారులు మరోమారు దరఖాస్తును పరిశీలించి చేయూత పెన్షన్ మంజూరు చేయాలని వారు కోరుతున్నారు.


