వైరారూరల్: వైరా మండలం రెబ్బవరంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడాపోటీలు ప్రారంభమయ్యాయి. అండర్–14, 19 విభాగాల్లో నిర్వహిస్తున్న ఈ పోటీలకు ఉమ్మడి జిల్లాలోని గురుకులాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. అండర్–14 విభాగంలో 12 జట్ల నుంచి 420 మంది, అండర్–19 విభాగంలో ఆరు జట్లుగా 120 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. కబడ్డీ, వాలీవాల్, ఖో–ఖో, అథెటిక్స్, చెస్ పోటీలను గురుకులాల ఆర్సీఓ సీ.హెచ్.రాంబాబు, డీసీఓ బి.రాణి, ప్రిన్సిపాల్ రాధిక రెడ్డి ప్రారభించారు.


