●భక్తిశ్రద్ధలతో నాగుల చవితి.. | - | Sakshi
Sakshi News home page

●భక్తిశ్రద్ధలతో నాగుల చవితి..

Nov 14 2026 12:35 AM | Updated on Nov 14 2026 12:35 AM

●థ్యాంక్యూ సార్‌.. గెలిచి చూపిస్తా.. దాతల వల్లే బడికి వెళ్తున్నా.. ఉన్నత చదువు నా కల..

సగం బాల్యం ఆస్పత్రిలో..

మిగతా సగం బడిలో

సూదుల సావాసంలోనూ చిరునవ్వులు

దాతలు, ‘సంకల్ప’ సంస్థ చేయూతతో

తలసేమియాపై చిన్నారుల పోరు

రూ.1,080 కోట్ల లింకేజీ రుణాల పంపిణీ లక్ష్యం

నేలకొండపల్లి: జిల్లాలో మహిళా సంఘాల సభ్యులకు రూ.1,080 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణీ చేసేలా లక్ష్యం నిర్దేశించుకున్నట్లు డీఆర్‌డీఓ కొండపల్లి శ్రీరామ్‌ తెలిపారు. మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయాన్ని శుక్రవారం తనిఖీ చేసిన ఆయన మాట్లాడారు. స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగా, ఇప్పటికే రూ.560 కోట్ల రుణాలు చెల్లించామని తెలిపారు. వీబీజీ రాంజీ పథకంలో కొలతల ప్రకారమే కూలీలకు వేతనాలు చెల్లించాలని, ఎవరికై నా ఎక్కువ చెల్లించినట్లు తేలితే సిబ్బంది చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అంతేకాక కనీసం నాలుగు గంటలు పనిచేయించడంతో పాటు జీపీఎస్‌ ఆధారిత హాజరు నమోదు చేయాలని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం రోజుకు సగటున 2,100 మంది కూలీలు పనికి వస్తున్నారని చెప్పారు. అలాగే, 490 వీఓ భవనాలు, 103 గ్రామపంచాయతీ భవనాలు నిర్మాణంలో ఉండగా చేసిన పని ఆధారంగా ఇప్పటివరకు రూ.9.20 కోట్లును చెల్లించినట్లు డీఆర్‌డీఓ తెలిపారు. ఐకేపీ ఏపీఎం కట్టా సురేందర్‌, సీసీలు పెద్ధపాక వెంకటేశ్వరరావు, పెరుగు మల్లయ్య, నాగేంద్ర, వెంకటేష్‌ పాల్గొన్నారు.

విధిని ఎదిరిస్తున్న విజేతలు!

తలసేమియా వ్యాధితో పోరాడుతున్న చిన్నారుల జీవితాల్లో ఆర్థిక భరోసా నింపేందుకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీసుకున్న చొరవపై బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. చేయూత పథకం ద్వారా పింఛన్లు మంజూరు చేయించడంతో తమకు ఆర్థిక భారం కాస్తయినా తగ్గుతుందని పేర్కొన్నారు. ఈమేరకు తాజా జాబితాలో పింఛన్లు మంజూరైన పలువురు చిన్నారులు తల్లిదండ్రులతో శుక్రవారం మంత్రిని ఖమ్మంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీగా ఉన్నప్పుడే తలసేమియా బాధితుల సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావించిన పొంగులేటి.. ప్రస్తుతం మంత్రిగా పింఛన్‌ మంజూరుకు చొరవ చూపారని సంతోషం వ్యక్తం చేశారు.

ఖమ్మంమయూరిసెంటర్‌: ఆటపాటలతో ఉత్సాహంగా గడపాల్సిన బాల్యం వారిది. తోటి పిల్లలతో కలిసి బడిలో గడపాల్సిన వయసులో వారు నిరంతరం సూదులతో సహవాసం చేస్తున్నారు. పుట్టిన నెలల నుంచే రక్తం ఎక్కించుకుంటూ సగం రోజులు ఆస్పత్రి పడకలపై, మిగతా రోజులు తరగతి గదుల్లో గడుపుతున్నారు. రక్తదాతలకు తోడు సంకల్ప సంస్థ చేయూతతో వారి కళ్లలో భయం లేకపోగా భవిష్యత్‌ అపారమైన ఆశ కనిపిస్తుంది. ‘మేమూ సాధారణ పిల్లలమే.. జీవితంలో నిలబడి గెలుస్తాం’ అంటూ ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తున్నారు తలసేమియా బాధిత చిన్నారులు.

రేపటి కంటే నేడే ముఖ్యం

సాధారణంగా చిన్నారులు భవిష్యత్‌పై అంచనాలు, ఆందోళనలు లేకుండా బాల్యాన్ని ఆస్వాదిస్తుంటారు. కానీ తలసేమియా చిన్నారుల ఆలోచనలు వారి వయసుకంటే ఎంతో పరిణతితో ఉన్నాయి. రేపటి రోజు ఎలా ఉంటుందో తెలియకపోయినా, ఈరోజు ఎంత సంతోషంగా, అర్థవంతంగా జీవిస్తున్నామన్నదే ముఖ్యమని చెబుతారు. కలలను సాకారం చేసుకునేందుకు నిత్యం ఒక పోరాటం చేస్తున్నామని అంటున్నారు.

దాతలు, సంకల్ప సంస్థ భరోసా

తలసేమియా మహమ్మారితో పోరాడుతున్న ఈ చిన్నారులకు దాతల ఉదారత, ‘సంకల్ప’ వంటి స్వచ్ఛంద సేవా సంస్థల తోడ్పాటు కొండంత అండగా నిలుస్తోంది. సకాలంలో రక్తం అందడం, సరైన వైద్యసాయం లభించడంతో వారు ప్రాణాలను నిలబెట్టుకుంటూనే చదువులో రాణిస్తున్నారు. తోటి విద్యార్థులతో కలిసి ఆడుకుంటూ, పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు.

నాకు జబ్బు ఉందని ఎప్పుడూ బాధపడను. మా అమ్మానాన్న, టీచర్లు ఎంతో ప్రోత్సహిస్తారు. ఆస్పత్రి నుంచి రాగానే మరుసటి రోజు బడికి వెళ్తాను. బాగా చదివి ఉన్నత స్థాయికి చేరి అమ్మానాన్నను సంతోషంగా చూసుకుంటా.

– డి.అఖిల్‌, 3వ తరగతి, పంగిడి

మా వాళ్లు పనికి వెళ్తూనే నన్ను సంరక్షించుకుంటున్నారు. నాకు రక్తం ఎక్కించడానికి చాలా ఖర్చవుతుంది. కానీ సంకల్ప సంస్థ, దాతలు అండగా నిలుస్తున్నారు. వాళ్ల వల్లే నేను బడికి వెళ్లి స్నేహితులతో ఆడుకోగలుగుతున్నాను.

– కె.సాత్విక్‌, 4వ తరగతి, ఇరవండి, బూర్గంపహడ్‌ మండలం

నెలలో రెండుసార్లు ఆస్పత్రికి వెళ్లి రక్తం ఎక్కించుకోవడం మొదట్లో బాధగా ఉండేది. సూది గుచ్చుతుంటే ఏడుపు వచ్చేది. కానీ ఇప్పుడు అలవాటైపోయింది. నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. ఉన్నత చదువులే నా లక్ష్యం.

– గుగులోత్‌ కోహినూర్‌, 8వ తరగతి, ఉసిరికాయలపల్లి

నేడు జాతీయ బాలల దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement