ఖమ్మంరూరల్: మాదకద్రవ్యాల మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టేలా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని.. ఇందుకు ప్రతీఒక్కరు సహకరించాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యాన ‘నషా ముక్త్ భారత్’లో భాగంగా పాఠశాలల విద్యార్థులకు జిల్లా స్థాయి క్విజ్ పోటీలు నిర్వహించగా, మంత్రి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు ఈగల్ టీమ్ ఏర్పాటు చేయగా, రాష్ట్రవ్యాప్తంగా 8వేల కేసులు నమోదు చేశారని తెలిపారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు సంబంధించి ఎవరైనా పట్టుబడితే సొంత మనుషులైనా సరే జైలుకు పంపాలని పోలీసు అధికారులకు ఆదేశించినట్లు చెప్పారు. అయితే, పోలీసు, ఎకై ్సజ్ శాఖల వల్లే డ్రగ్స్ నియంత్రణ పూర్తిస్థాయిలో సాధ్యం కాదని, ఇందులో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర కీలకమని తెలిపారు. పిల్లల నడవడికపై నిత్యం దృష్టి సారిస్తూ మంచి మార్గంలో నడిచేలా సూచనలు చేయాలని మంత్రి సూచించారు. అనంతరం పోటీల్లో విజేతలకు అధికారులు బహుమతులు అందజేశారు. అదనపు కలెక్టర్ పి.శ్రీజ, ఎకై ్సజ్ అదనపు కమిషనర్ కిషన్, డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, జిల్లా సూపరింటెండెంట్ డి.జానయ్య, ఏదులాపురం మున్సి పల్ కమిషనర్ ఆళ్ల కమిషనర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎకై ్సజ్ శాఖ క్విజ్ పోటీల్లో
మంత్రి పొంగులేటి


