ఇద్దరు సీఐ పోస్టింగ్‌లు నిలిపివేత | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు సీఐ పోస్టింగ్‌లు నిలిపివేత

Nov 14 2026 12:35 AM | Updated on Nov 14 2026 12:35 AM

ఖమ్మంక్రైం: ఖమ్మం కమిషనరేట్‌ పరిధిలో ఇటీవల ఇద్దరు సీఐలకు ఇచ్చిన పోస్టింగ్‌లను రద్దు చేస్తూ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఖమ్మం టూటౌన్‌, ఖానాపురం హవేలీ సీఐలుగా పనిచేసిన బాలకృష్ణ, భానుప్రకాశ్‌కు సీసీఆర్‌బీ, సీటీసీలో పోస్టింగ్‌ ఇచ్చారు. వీరిద్దరు విధుల్లో చేరేందుకు సిద్ధమవుతుండగా పోస్టింగ్‌లను రద్దు చేసి వీఆర్‌లోనే కొనసాగేలా తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఐజీ స్థానం నుంచి చంద్రశేఖర్‌రెడ్డి బదిలీపై వెళ్తున్న సమయంలో వెలువడిన ఈ నిర్ణయం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది.

నేటి నుంచి ఆల్‌

ర్యాంకింగ్‌ టెన్నిస్‌ టోర్నీ

ఖమ్మం స్పోర్ట్స్‌: ఆల్‌ ఇండియా టెన్నిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన ఈనెల 14నుంచి 20వ తేదీ వరకు ఆల్‌ ఇండియా జూనియర్‌ ర్యాంకింగ్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.సత్యనారాయణ, డాక్టర్‌ అనిల్‌ తెలిపారు. ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో ఈ పోటీలు జరగనుండగా, 14, 15వ తేదీల్లో క్వాలిఫైయింగ్‌ పోటీలు, 16నుంచి ర్యాంకింగ్‌ టోర్నీ జరుగుతుందని వివరించారు. పోటీలకు దేశంలో ఉత్తమ ర్యాంక్‌ కలిగిన టెన్నిస్‌ క్రీడాకారులు హాజరుకానున్నారని తెలిపారు. ఈ పోటీలు జిల్లా క్రీడాకారుల ను ప్రోత్సహించడంతో పాటు జిల్లాలో టెన్నిస్‌ అభివృద్ధికి దోహదపడతాయని వెల్లడించారు.

కేసుల దర్యాప్తులో

మరింత వేగం

● పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌

రఘునాథపాలెం: పెండింగ్‌ కేసుల దర్యాప్తులో మరింత వేగం పెంచడంతో పాటు రౌడీ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌ ఆదేశించారు. రఘునాథపాలెం పోలీసుస్టేషన్‌ను శుక్రవారం తనిఖీ చేసిన ఆయన రికార్డులు, పెండింగ్‌ కేసుల దర్యాప్తును పరిశీలించారు. స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా మాట్లాడి చట్టపరిధిలో న్యాయం జరిగేలా కృషి చేయాలని తెలిపారు. కేసుల దర్యాప్తులో వేగం పెంచి త్వరగా చార్జీషీట్లు దాఖలు చేయాలని, తద్వారా నిందితులకు శిక్ష పడుతుందని చెప్పారు. అనంతరం స్టేషన్‌ ఆవరణలో సీపీ మొక్క నాటారు. ఖమ్మం టౌన్‌ ఏసీపీ రమణమూర్తి, సీఐ కరుణాకర్‌, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

హెచ్‌ఐవీ కట్టడిలో

‘సురక్షిత్‌’ హోదా

ఖమ్మం వైద్యవిభాగం: హెచ్‌ఐవీ కట్టడిలో జిల్లా కు ‘సురక్షిత్‌’ హోదా లభించిందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి రామారావు తెలిపారు. హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నివారణలో పాలుపంచుకుంటున్న కౌన్సిలర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ కార్యక్రమం కింద జిల్లా ‘సురక్షిత్‌’ హోదా సాధించేలా సమష్టి కృషి చేయడంపై అభినందించారు. తదుపరి ‘సురక్షిత్‌ ప్లస్‌’ కేటగిరీని చేరడానికి అందరూ మరింత అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఈసమావేశంలో అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ ప్రమీల, డాక్టర్‌ మోహన్‌రావు, నాగయ్య, మహమ్మద్‌ అలీ, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement