పేదల సంక్షేమానికి ప్రాధాన్యత | - | Sakshi
Sakshi News home page

పేదల సంక్షేమానికి ప్రాధాన్యత

Nov 14 2026 12:35 AM | Updated on Nov 14 2026 12:35 AM

దశల వారీగా అర్హులందరికీ

ఇళ్లు, పింఛన్లు

రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మం రూరల్‌/కూసుమంచి: గత పాలకులు కమీషన్ల కోసం కాళేశ్వరం వంటి ప్రాజెక్టులను కడితే తాము మాత్రమే పేదల సంక్షేమమే లక్ష్యంగా రూ.40వేల కోట్లు వెచ్చించి ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఖమ్మం రూరల్‌ మండలం ఎం.వెంకటాయపాలెం, కూసుమంచిలో శుక్రవారం జరిగిన సమావేశాల్లో నూతన లబ్ధిదారులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను అదనపు కలెక్టర్‌ శ్రీజతో కలిసి మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమాల్లో పొంగులేటి మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక పేదల కోసం అనేక పథకాలు ప్రారంభించామని తెలిపారు. ఇప్పటికే దశల వారీగా ఇళ్లు మంజూరు చేస్తుండగా.. కనీస ఆసరా లేక ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారికి పింఛన్లు మంజూరు చేశామని చెప్పారు. అయితే, ఇప్పుడు పేదలపై ప్రేమ వలకబోస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులకు నాడు వారు ఎందుకు గుర్తుకురాలేదో చెప్పాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా కులం, మతం, పార్టీ చూడకుండా అర్హతలే ప్రామాణికంగా ప్రభుత్వ పథకాలను అందిస్తున్నామని వెల్లడించారు. త్వరలో మహిళలకు ఇచ్చిన మరో రెండు హామీలు కూడా అమల్లోకి వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో డీఆర్‌డీఓ కొండపల్లి శ్రీరామ్‌, డీవైఎస్‌ఓ సునీల్‌రెడ్డి, ఏదులాపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్లు పోకబత్తిని అనిత, తమ్మినేని నవీన్‌, ఆర్‌డీఓ శ్రీనివాస్‌, తహసీల్దార్లు సైదులు, వినయేందర్‌రెడ్డి, ఎంపీడీఓలు జశ్వంత్‌కుమార్‌, కె.రవికుమార్‌, నాయకులు, ప్రజాప్రతినిధులు మట్టా దయానంద్‌, బజ్జూరి వెంకటరెడ్డి, బండి సతీష్‌, కుమ్మరి అంబేద్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement