సత్తా చాటిన ముసలిమడుగు విద్యార్థినులు | - | Sakshi
Sakshi News home page

సత్తా చాటిన ముసలిమడుగు విద్యార్థినులు

Nov 14 2026 12:35 AM | Updated on Nov 14 2026 12:35 AM

వైరారూరల్‌: మండలంలోని రెబ్బవరం మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల, కళాశాలలో మూడు రోజులుగా జరుగుతున్న ఉమ్మడి జిల్లా స్థాయి గురుకుల బాలికల క్రీడాపోటీలు శుక్రవారం ముగిశాయి. ఉమ్మడి జిల్లాలోని 12గురుకులాల నుంచి 420 మంది విద్యార్థినులు ఖో–ఖో, కబడ్డీ, వాలీబాల్‌, అథ్లెటిక్స్‌, చెస్‌ తదితర పోటీల్లో తలపడ్డారు. ఖో–ఖోలో ముసలిమడుగు, దుమ్ముగూడెం గురుకులాలు, కబడ్డీలో ముసలిముడుగు, టేకులపల్లి, వాలీబాల్‌లో ముసలిముడుగు, దానవాయివాగూడెం, టెన్నికాయిట్‌లో ముసలిమడుగు, దానవాయిగూడెం జట్లు మొదటి, రెండో స్థానాలు దక్కించుకున్నాయి. చెస్‌లో ఎం.యమాని(సత్తుపల్లి), ఏ.సంజన(టేకులపల్లి), మార్చ్‌పాస్ట్‌లో ముసలిమడుగు, పినపాక విద్యార్థినులు, గ్రౌండ్‌ ఫర్‌ఫార్మెన్స్‌లో ముసలిమడుగు, పాల్వంచ గురుకులాల జట్లు మొదటి, రెండో స్థానాల్లో నిలిచాయి. వ్యక్తిగత విభాగంలో ముసలిమడుగు గురుకులం విద్యార్థి బి.జయంతి ట్రోఫీ దక్కించుకుంది. విజేతలకు గురుకులాల ఆర్‌సీఓ రాంబాబు, ప్రిన్సిపాల్‌ రాధిక బహుమతులు అందజేశారు.

ముగిసిన ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడాపోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement