రేక్‌ పాయింట్‌కు యూరియా | - | Sakshi
Sakshi News home page

రేక్‌ పాయింట్‌కు యూరియా

Nov 14 2026 12:35 AM | Updated on Nov 14 2026 12:35 AM

చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్‌ పాయింట్‌కు ఆర్‌ఎఫ్‌సీఎల్‌ కంపెనీకి చెందిన 1,196.46 మెట్రిక్‌ టన్నుల యూరియా శుక్రవారం చేరింది. ఇందులో నుంచి కోటా వారీగా ఖమ్మం జిల్లాకు 496.46 మె.టన్నులు, భద్రాద్రి జిల్లాకు 700 మె.టన్నులు సరఫరా చేశామని ఖమ్మం డీఏఓ ధనసరి పుల్లయ్య తెలిపారు.

నేటి నుంచి జాతీయస్థాయి బాలోత్సవ్‌

మధిరరూరల్‌: రామభక్త సీతయ్య కళాపరిషత్‌ ఆధ్వర్యాన మధిరలో ఈనెల 14, 15వ తేదీల్లో జాతీయస్థాయి 28వ బాలోత్సవ్‌ నిర్వహించనున్నారు. మధిర బంజారా కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కల్యాణ మండపంలో బాలోత్సవ్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఖమ్మం, వైరా, కొత్తగూడెం, భద్రాచలం, వరంగల్‌, హైదరాబాద్‌, విజయవాడ, తిరువూరు తదితర ప్రాంతాలకు చెందిన 60 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల నుంచి ఎంట్రీలు వచ్చాయి. తొలిరోజైన శనివారం శాసీ్త్రయ, జానపద నృత్య పోటీలు, ఆదివారం నీతి పద్యాలు, ఏకపాత్రాభినయం, విచిత్ర వేషధారణ పోటీలు జరుగుతాయని నిర్వాహకులు పుతుంబాక శ్రీకృష్ణ ప్రసాద్‌, బాబ్ల తెలిపారు.

జిల్లా అండర్‌–16

క్రికెట్‌ జట్టు ఎంపిక

ఖమ్మం స్పోర్ట్స్‌: తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌(టీసీఏ) ఆధ్వర్యాన బాలుర అండర్‌–16 క్రికెట్‌ జట్టును ఎపిక చేశారు. ఖమ్మంలో శుక్రవారం జరిగిన ఎంపిక పోటీలను అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ కూరపాటి ప్రదీప్‌, కార్యదర్శి జి.వీరేశం పర్యవేక్షించారు. జట్టుకు వి.రిషి, మైఖేల్‌, అరుణ్‌, స్కందన్‌, హర్షవర్థన్‌, విశ్వక్‌రెడ్డి, యువరాజ్‌ పటేల్‌, శివసాయిరెడ్డి, సుశాంత్‌, అఖిల్‌, ఉజీర్‌, శాంతి స్వరూప్‌, సాయి సుకృత్‌, ఉమేష్‌, హర్షసాయి, మహేష్‌ ఎంపిక కాగా, ఈ జట్టు 17వ తేదీ నుంచి హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననుంది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ సభ్యులు నరేష్‌, రాజీవ్‌ రాజ్‌, మణికుమార్‌, గౌతమ్‌, రాధిక పాల్గొన్నారు.

నేటి నుంచి రాష్ట్రస్థాయి జూడో టోర్నీ

ఖమ్మం స్పోర్ట్స్‌: రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ బాలబాలికల జూడో పోటీలు శనివారం నుంచి ఖమ్మం రూరల్‌ మండలం కామంచికల్‌ జరగనున్నాయి. పోటీలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 420 మంది బాలబాలికలు హాజరు కానున్నారు. తిరుమలమ్మ ఫంక్షన్‌ హాల్‌లో జరిగే పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారితో రాష్ట్ర జట్టును ఎంపిక చేస్తారు. జూడో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బైరబోయిన కై లాస్‌యాదవ్‌ పోటీలను పర్యవేక్షిస్తారని నిర్వాహకులు బానోత్‌ రవి, సంతోష్‌కుమార్‌ తెలిపారు.

ఈనెల 30వరకు

ప్రవేశాలకు అవకాశం

ఖమ్మం సహకారనగర్‌: ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు ఈనెల 30వ తేదీ వరకు అవకాశం ఉందని డీఈఓ వాసంతి, ఓపెన్‌ స్కూల్‌ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్‌ మంగపతిరావు తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అపరాధ రుసుముతో సహా ఫీజు చెల్లించి ప్రవేశాలు పొందొచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 94407 28543, 80084 03522 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

ధాన్యం కొనుగోలు

కేంద్రాలు ఏర్పాటు చేయాలి

ఖమ్మంమయూరిసెంటర్‌: జిల్లా రైతులు నష్టపోకుండా ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరతో కొనుగోళ్లు చేపట్టాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. రైతుల వద్ద ధాన్యం ఉన్నప్పుడు కొనుగోలు చేయకుండా ఆలస్యం చేస్తే, దళారులు తక్కువ ధరతో దక్కించుకుంటారని తెలిపారు. ఇప్పటికే సిండికేట్‌ అయిన మిల్లర్లు కొన్నాళ్ల క్రితం క్వింటా రూ.3,500 ఉన్న ధాన్యం ధర ప్రస్తుతం రూ.2,600కు తగ్గించారని ఆరోపించారు. రైతులు మరింత నష్టపోకముందే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాలని ఆయన ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement