గోశాల అభివృద్ధికి రూ.1,00,116 విరాళం | - | Sakshi
Sakshi News home page

గోశాల అభివృద్ధికి రూ.1,00,116 విరాళం

Nov 14 2026 12:35 AM | Updated on Nov 14 2026 12:35 AM

ఖమ్మంఅర్బన్‌: ఖమ్మం గొల్లగూడెంలోని ఓం శ్రీకృష్ణ గోశాలలో షెడ్డు నిర్మాణానికి దేవిశెట్టి అశోక్‌కుమార్‌–అంజలికుమారి దంపతులు శుక్రవారం రూ.1,00,116 విరాళం అందజేశారు. తమ కుమార్తె స్వప్నభార్గవీ జ్ఞాపకార్థం నగదు అందించగా గోశాల నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

యాసంగిలో వరి,

మొక్కజొన్న సాగు వద్దు

ఖమ్మంఅర్బన్‌: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యాన రానున్న యాసంగి సీజన్‌లో రైతులు వరి, మొక్కజొన్న పంటలు సాగు చేయవద్దని జలవనరుల శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ వాసంతి కోరారు. చెరువులు, కాల్వల కింద యాసంగి పంటలకు సరిపడా నీటి లభ్యత లేదని తెలిపారు. ఎన్నెస్పీ డ్యామ్‌లో అందుబాటులో ఉన్న జలాలు తాగు అవసరాలకే సరిపోతాయని, గోదావరిలో నీటి లభ్యత తగ్గుతున్నందున సీతా రామ ప్రాజెక్టు ద్వారా విడుదల చేసే అవకాశం లేదని చెప్పారు. చెరువుల్లోని నీటిని తాగు అవసరాలు, భూగర్భ జలాల పెంపు, పశువుల అవసరా లకు కాపాడుకోవాలని సూచించారు. నీటి లభ్యతను రైతులు గుర్తించి వరి, మొక్కజొన్నకు బదులు నువ్వులు, కొర్రలు, సజ్జలు, రాగులు, జొన్నలు, పెసలు, మినుములు వంటి ఆరుతడి పంటలనే రైతులు సాగు చేసుకోవాలని సీఈ ఓ ప్రకటనలో కోరారు.

నేడు బాలల హక్కులు,

సమస్యలపై గ్రామసభలు

ఖమ్మం సహకారనగర్‌: జాతీయ బాలల దినోత్స వం సందర్భంగా బాలల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా శనివారం అన్ని గ్రామపంచాయతీల్లో ప్రత్యేక బాలల గ్రామసభలు నిర్వహించాలని కలెక్టర్‌ దివాకర ఆదేశించారు. బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మానవ అక్రమ రవాణా, బాలలపై వేధింపులు, హింస, మాదకద్రవ్యాల వినియోగం, ఆన్‌లైన్‌, డిజిటల్‌ మాధ్యమాల ద్వారా ఎదురయ్యే ముప్పు, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సభల్లో అవగాహన కల్పించడమే కాక సమావేశాలను వీడియో చిత్రీకరించి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని కలెక్టర్‌ సూచించారు. అలాగే, బాలల సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టిన చర్యలు, పురోగతి, గ్రామాల్లో బాలల పరిస్థితులపై నివేదికలను అందజేయాలని తెలిపారు.

విధి నిర్వహణలో

ధైర్యసాహసాలు గర్వకారణం

సత్తుపల్లిరూరల్‌: విధినిర్వహణలో పోలీసు సిబ్బంది ప్రదర్శిస్తున్న ధైర్యసాహసాలు పోలీసు వ్యవస్థకే గర్వకారణమని బెటాలియన్ల డీఐజీ మురళీకృష్ణ తెలిపారు. సత్తుపల్లి మండలం గంగారంలోని 15వ ప్రత్యేక పోలీస్‌ బెటాలియన్‌ను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించాక మాట్లాడారు. బెటాలియన్లు పోలీసు వ్యవస్థకే వెన్నెముక వంటివని తెలిపారు. అనంతరం అధికారులు, సిబ్బందితో నిర్వహించిన దర్బార్‌లో పాల్గొని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే, బెటాలియన్‌లోని శిక్షణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. బెటాలియన్‌ కమాండెంట్‌ ఎన్‌.పెద్దబాబు, అదనపు కమాండెంట్‌ ఏ.అంజయ్యతో పాటు బి.వినాయకరావు, బి.వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement