కేటీఆర్‌ను కలిసిన పువ్వాడ | - | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ను కలిసిన పువ్వాడ

Nov 14 2026 12:35 AM | Updated on Nov 14 2026 12:35 AM

ఖమ్మం వైరారోడ్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావును మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ హైదరాబాద్‌లో కలిశారు. కేటీఆర్‌ను ఆయన నివాసంలో శుక్రవారం కలిసిన పువ్వాడ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఓటర్ల నమోదు, ఇతర అంశాలపై చర్చించారు.

ప్రతిభ చాటిన బాలికకు రూ.లక్ష నగదు బహుమతి

కొణిజర్ల: గత మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో వైరా నియోజకవర్గ స్థాయిలో మండలంలోని సింగరాయపాలెం పీఎంశ్రీ పాఠశాల విద్యార్థిని ఆవుల శ్రీజ మొదటి స్థానాన నిలిచింది. దీంతో ఆమెకు శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్యూరెన్స్‌ కంపెనీ నుంచి రూ.లక్ష నగదు బహుమతి ప్రకటించారు. ఈమేరకు చెక్కును శుక్రవారం శ్రీరామ్‌ లైఫ్‌ మేనేజర్లు రమేష్‌, సురేష్‌ బాలిక తల్లిదండ్రులకు అందజేయగా, సర్పంచ్‌లు వేము నాగరాజు, గొల్లమందల ఆదిత్య, పాఠశాల హెచ్‌ఎం కె.లక్ష్మీనారాయణ, పాఠశాల కమిటీ చైర్మన్‌ జహీదా పాల్గొన్నారు.

డయల్‌ 112 ఫోన్‌కు

తక్షణ స్పందన

● మహిళను అప్పగించిన పోలీసులు

ఖమ్మంక్రైం: డయల్‌ 112కు వచ్చిన ఫోన్‌తో తక్షణమే స్పందించిన పోలీసులు తప్పిపోయిన ఓ మహిళను క్షేమంగా కుటుంబసభ్యులకు అప్పగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుకు చెందిన ఓ మహిళ శుక్రవారం ఖమ్మం వచ్చి తప్పిపోయింది. దీంతో కుటుంబసభ్యులు డయల్‌ 112కు ఫిర్యాదు చేయగా స్పందించిన ఖమ్మం టూ టౌన్‌, బ్లూ కోట్స్‌ సిబ్బంది ఆరా తీస్తూ ఖమ్మం కొత్త బస్టాండ్‌ వద్ద ఆమెను గుర్తించారు. ఆపై మహిళను కుటుంబసభ్యులకు అప్పగించినట్లు సీఐ రామకృష్ణ తెలిపారు.

జెడ్పీ సీఈఓగా శ్రీనివాసరావు

ఖమ్మం సహకారనగర్‌: జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి(జెడ్పీ సీఈఓ) దీక్షారైనా మాతృత్వ సెలవులో వెళ్లారు. దీంతో డిప్యూటీ సీఈఓ పొన్నూరు శ్రీనివాసరావుకు సీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు కలెక్టర్‌ దివాకర శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement