ఖమ్మం వైద్యవిభాగం: జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో నూరు శాతం లక్ష్యాలను సాధించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. జిల్లాలో అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాల పురోగతిపై కలెక్టరేట్లో శుక్రవారం ఆమె సమీక్షించారు. టెలీ మానస్ ప్రోగ్రాం అమలు మెరుగపడాల్సి ఉందని తెలిపారు. ఈనెల 1నుంచి 10వ తేదీ వరకు ఎస్న్సీయూ చేరిన శిశువుల వివరాలు, వారి చికిత్సపై నివేదిక అందించాలని పేర్కొన్నారు. ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించి ప్రతీ ప్రోగ్రామ్ అధికారి అమలు, పురోగతిపై దృష్టి సారించాలని, తద్వారా ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ రామారావు, అడిషనల్ డీఎంహెచ్ఓ ఎల్.ప్రవీణ, డిప్యూటీ డీఎంహెచ్ఓలు వేణు మాధవరావు, ప్రదీప్బాబు, ప్రోగ్రామ్ అధికారులు బిందుశ్రీ, మోత్యా, లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ


