శాసీ్త్రయ దృక్పథాన్ని పెంచడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

శాసీ్త్రయ దృక్పథాన్ని పెంచడమే లక్ష్యం

Nov 13 2026 12:34 AM | Updated on Nov 13 2026 12:34 AM

ఖమ్మం సహకారనగర్‌: విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, పరిశోధనా నైపుణ్యాలు, సృజనాత్మక ఆలోచనలు పెంచడమే లక్ష్యమని జిల్లా విద్యాశాఖాధికారి డి.వాసంతి తెలిపారు. ఈమేరకు జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌లో భాగంగా జిల్లా స్థాయి ప్రాజెక్టుల ప్రదర్శన పోటీలను గురువారం ఖమ్మంలోని సైన్స్‌ మ్యూజియంలో నిర్వహించగా ఆమె మాట్లాడారు. వివిధ పాఠశాలల నుంచి మొత్తం 92 ప్రాజెక్టులు ప్రదర్శించడం అభినందనీయమన్నారు. పర్యావరణ, నీటి సంరక్షణ, వ్యవసాయం, ఆరోగ్యం, వ్యర్థ పదార్థాల నిర్వహణపై ప్రదర్శించిన ప్రాజెక్టులు ఆలోచింపజేసేలా ఉన్నాయని తెలిపారు. ఈమేరకు ఉత్తమంగా ఉన్న ఆరు ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు వెల్లడించారు. జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ జిల్లా సమన్వయకర్త ఇనుముల వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా, కోఆర్డినేటర్‌ ఎం.డాన్‌ బాస్కో, రిసోర్స్‌ పర్సన్‌ రంజిత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా విద్యాశాఖాధికారి వాసంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement