రేషన్‌షాప్‌లో బియ్యం నిల్వల్లో తేడా | - | Sakshi
Sakshi News home page

రేషన్‌షాప్‌లో బియ్యం నిల్వల్లో తేడా

Nov 13 2026 12:34 AM | Updated on Nov 13 2026 12:34 AM

కామేపల్లి: ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి చందన్‌కుమార్‌ స్పష్టం చేశారు. రేషన్‌షాప్‌ల ద్వారా లబ్ధిదారులకు డీలర్లు సన్నబియ్యం సక్రమంగా సరఫరా చేయాలని తెలిపారు. కామేపల్లి మండలం గరిడేపల్లిలోని రేషన్‌షాప్‌లో గురువారం తనిఖీ చేసిన ఆయన రికార్డుల ఆధారంగా స్టాక్‌ను పరిశీలించారు. అయితే, గత మూడు నెలల కాలానికి గాను 76.76 క్వింటాళ్ల బియ్యం తక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో డీలర్‌ రాములుపై కేసు నమోదు చేశామని డీసీఎస్‌ఓ తెలిపారు. సివిల్‌ సప్లయీస్‌ ఉద్యోగులు, జీపీఓ బోలేషా పాల్గొన్నారు.

రేషన్‌ షాపులో

54 క్వింటాళ్ల బియ్యం చోరీ

వైరారూరల్‌: వైరా మున్సిపాలిటీ పరిధి గండగలపాడులోని రేషన్‌ షాపులో 54 క్వింటాళ్ల (108 బస్తాలు) బియ్యాన్ని బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. డీలర్‌ మోగునురి కృష్ణకుమారి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాలిలా ఉన్నాయి. డీలర్‌ రోజులాగే బుధవారం సాయంత్రం 6 గంటల వరకు లబ్ధిదారులకు బియ్యం అందజేశాక షాప్‌నకు తాళం వేసి స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురం వెళ్లారు. ఆ సమయంలో 133 బస్తాల బియ్యం ఉండగా, గురువారం ఉదయం వచ్చేసరికి షాప్‌ తాళాలు పగులగొట్టి ఉన్నాయి. షాప్‌లో 54 క్వింటాళ్ల(108 బస్తాలు) బియ్యం లేకపోవడంతో చోరీ అయినట్టు గుర్తించిన ఆమె తహసీల్దార్‌కు సమాచారం ఇచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

20, 21వ తేదీల్లో

జిల్లా స్థాయి కబడ్డీ టోర్నీ

ఎర్రుపాలెం: మండలంలోని మామునూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఈనెల 20, 21వ తేదీల్లో పాఠశాలల క్రీడా సంఘం ఆధ్వర్యాన జిల్లా స్థాయి కబడ్డీ టోర్నీ నిర్వహించనున్నారు. అండర్‌ – 17 విభాగంలో జరిగే పోటీలకు 21మండలాల నుంచి బాలబాలికల జట్లు హాజరుకానున్నాయి. ఈ సందర్భంగా గురువారం స్థానిక ఎమ్మార్సీ కార్యాలయంలో పీఈటీలు, పీడీలతో సమావేశమైన ఎంఈఓ బి.మురళీమోహన్‌రావు పోటీల నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. క్రీడాసంఘం మండల కార్యదర్శి మారాబత్తుల జమలయ్యతో పాటు పీఈటీలు, పీడీలు సత్యనారాయణరెడ్డి, నరాల సాంబశివారెడ్డి, మారాబత్తుల నాగేశ్వరరావు, అజీమ్‌, గోపిరెడ్డి, వేణు, జహీరా తదితరులు పాల్గొన్నారు.

క్రికెట్‌ టోర్నీలో

రెండో స్థానాన జిల్లా జట్టు

కేయూ క్యాంపస్‌: హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీలో మూడు రోజులుగా జరుగుతున్న అంతర్‌ కళాశాలల జోనల్‌ క్రికెట్‌ టోర్నీ గురువారం ముగిసింది. పోటీల్లో ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల జట్లు పాల్గొనగా ఫైనల్స్‌లో వరంగల్‌ – ఖమ్మం జట్లు తలపడ్డాయి. ఈమేరకు వరంగల్‌ జట్టు విజేతగా, రెండో స్థానంలో ఖమ్మం జట్టు నిలిచింది. జట్లకు ట్రోఫీలు అందజేశాక కేయూ స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ టి.శాస్త్రి మాట్లాడుతూ టోర్నీలో ప్రతిభ చూపిన క్రీడాకారులతో తమిళనాడులోని ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో జరిగే సౌత్‌జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ క్రికెట్‌ టోర్నీకి జట్టును ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇంటర్‌ కాలేజియేట్‌ టోర్నీ ఇన్‌చార్జ్‌ ఎస్‌.కుమార్‌, ఫిజికల్‌ డైరెక్టర్ల అసోసియేషన్‌ కేయూ అధ్యక్షుడు జె.సోమన్న, పీడీలు వెంకన్న, గోపీకృష్ణ, అస్లాం, శ్రీనివాస్‌, మట్టెడ కుమారస్వామి, అప్జల్‌, కోటి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement