ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్యమించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్యమించాలి

Nov 13 2026 12:34 AM | Updated on Nov 13 2026 12:34 AM

ఖమ్మం మామిళ్లగూడెం: ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతీ పౌరుడు ఉద్యమించాలని బీజేపీ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కోరారు. ఖమ్మంలోని ఐఎంఏ హాల్‌లో గురువారం నిర్వహించిన మేధావులతో సంగోష్టి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు మౌనంగా ఉండడం పౌరుల బాధ్యత కాదని తెలిపారు. ఈమేరకు ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగ విలువలు, దేశ సమగ్రతను కాపాడుకోవడానికి ప్రతిఒక్కరూ చైతన్యవంతులై ముందుకు రావాలని కోరారు. ప్రజా స్వామ్యాన్ని బలహీనపరిచేలా వ్యవహరించే శక్తులు, వ్యవస్థలను గమనించాలని సూచించారు. డాక్టర్‌ గోంగూర వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఐఎంఏ అధ్యక్షుడు కూరపాటి హరిప్రసాద్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, నాయకులు మార్తి వీరభద్ర ప్రసాద్‌ పాల్గొన్నారు.

ఫుడ్‌ పార్క్‌పై శ్వేతపత్రం విడుదల చేయండి

సత్తుపల్లి: మండలంలోని బుగ్గపాడు మెగా ఫుడ్‌ పార్క్‌ భూముల కేటాయింపు, పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల వివరాలపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సత్తుపల్లిలోని అయ్యప్పస్వామి ఆలయంలో పూజలు చేయడంతో పాటు అన్నదానంలో పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఫుడ్‌ పార్క్‌లో రూ.600 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయని చెబుతున్న రాష్ట్రప్రభుత్వం భూముల కేటాయింపు ధర, ఇతర వివరాలను వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. అలాగే, సింగరేణిలో బొగ్గు రవాణా, నాణ్యత, ఉద్యోగ నియామకాలు, క్వార్టర్ల నిర్మాణంపై విచారణ జరిపించాలని సూచించారు.

అన్నదాతలను ఆదుకోవాలి

తల్లాడ/కల్లూరు రూరల్‌: తుపాన్‌పై రైతులను అప్రమత్తం చేయకపోగా, పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీ కిసాన్‌ మోర్చా ఆధ్వర్యాన తల్లాడ మండలం కృష్ణాపురంలో తుపాన్‌ కారణంగా దెబ్బతిన్న పలువురి పంటలను ఆయన పరిశీలించారు. జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్యకు ఫోన్‌ చేసి పంట నష్టాన్ని వేయించాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన ను సమర్థవంతంగా అమలు చేసి ఉంటే రైతులకు కొంతైనా భరోసా లభించేదన్నారు. అనంతరం కల్లూరులో సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, నాయకులు నంబూరి రామలింగేశ్వరరావు, భాస్కర్ణి వీరంరాజు, చల్లా నాగులు, ఎన్‌.వెంకటేశ్వర్‌రావు, ఆపతి వెంకటరామారావు, నన్నపనేని శారద, వాడవల్లి నాగేశ్వర్‌రావు, రాయల రమేష్‌, గుమ్మా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ జాతీయ నాయకుడు సుధాకర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement