సృజనాత్మకతను వెలికితీసేలా ‘బాలోత్సవ్‌’ | - | Sakshi
Sakshi News home page

సృజనాత్మకతను వెలికితీసేలా ‘బాలోత్సవ్‌’

Nov 13 2026 12:34 AM | Updated on Nov 13 2026 12:34 AM

ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక సంబురాలు

ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక సంబురాలు

ఖమ్మంగాంధీచౌక్‌: చిన్నారుల సృజనాత్మకతను వెలికితీయడంతో వారిని ప్రోత్సహించేలా బాలోత్సవ్‌ వేదికగా నిలిచింది. ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో రెండు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి ఖమ్మం బాలోత్సవ్‌లో పిల్లలు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. వారధి ఫౌండేషన్‌, ఖమ్మం డాన్సర్స్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యాన నిర్వహించిన బాలోత్సవ్‌కు వివిధ జిల్లాల నుంచి బాలబాలికలు హాజరయ్యారు. రెండో రోజైన గురువారం సంప్రదాయ, జానపద విభాగంలో చిన్నారులు తమ నృత్యాలతో ఉర్రూతలూగించారు. ఫ్యాన్సీ డ్రెస్‌ పోటీల్లో ఎల్‌నినో, కాలుష్యం, పర్యావరణ పరిరక్షణ అంశాలతో కొందరు, స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలతో ఇంకొందరు ఆకట్టుకున్నారు.

పోటీల నిర్వహణ అభినందనీయం

రాష్ట్ర స్థాయి బాలోత్సవ్‌ వేడుకలు ఖమ్మం ప్రతిష్టను ప్రతిబింబించాయని కాంగ్రెస్‌ నాయకుడు తుమ్మల యుగంధర్‌ అన్నారు. ముగింపు సమావేశంలో విజేతలకు బముమతులు అందజేశాక ఆయన మాట్లాడుతూ పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేలా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. వారధి ఫౌండేషన్‌ చైర్మన్‌ చింతనిప్పు కృష్ణచైతన్య మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికి తీయడానికి బాలోత్సవ్‌ నిర్వహించామని తెలిపారు. ఖమ్మం మార్కెట్‌ చైర్మన్‌ యరగర్ల హన్మంతరావు, వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు అశోక్‌రెడ్డి, డాక్టర్‌ రాధికారాణి, కొల్లి కల్పన, చింతనిప్పు సుకన్య, ఖమ్మం డాన్సర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాయల్‌ నాగరాజుతో పాటు చిక్కుళ్ల వెంకటేష్‌, పగిళ్లపల్లి రాజు, ఆర్‌.ఎన్‌.ప్రసాద్‌, రాజేష్‌, భవానీశంకర్‌, ముఖేష్‌, నాని, సతీష్‌, సంతోషి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement