టీకా వికటించి చిన్నారి మృతి? | - | Sakshi
Sakshi News home page

టీకా వికటించి చిన్నారి మృతి?

Nov 13 2026 12:34 AM | Updated on Nov 13 2026 12:34 AM

కూసుమంచి: మండలంలోని పెద్ద పోచారం గ్రామంలో రెండు నెలల చిన్నారి మృతి చెందింది. అయితే, శిశువుకు వేయించిన టీకానే ఇందుకు కారణమని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పెద్దపోచారానికి చెందిన గౌతమికి బోనకల్‌ మండలం నామవరం గ్రామవాసి రాజుతో వివాహం జరగగా, ఆమె కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది. ఈమేరకు రెండో సంతానం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శిశువుకు రెందు నెలలు నిండడంతో స్థానిక హెల్త్‌ సబ్‌సెంటర్‌లో బుధవారం టీకా వేయించారు. ఆపై చిన్నారి అస్వస్థతకు గురవగా గురువారం మృతి చెందింది. టీకా వేయించాకే చిన్నారికి తీవ్ర జ్వరం వచ్చి మృతి చెందిందని తల్లిదండ్రులు, కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. వైద్యాధికారులు మాత్రం ఇతర కారణాలతోనే మృతి చెంది ఉంటుందని చెబుతున్నారు. ఘటనపై మెడికల్‌ ఆఫీసర్‌ సాయికుమార్‌ వివరణ కోరగా... చిన్నారికి తమ సిబ్బంది టీకా వేయగా, ఆ తర్వాత జ్వరంతో చిన్నారి మృతి చెందిందనే సమాచారం అందిందని చెప్పారు. టీకా వికటిస్తే వెంటనే ప్రభావం చూపుతుందని, కానీ 40గంటల తర్వాత మృతి చెందిన నేపథ్యాన విచారణ చేపడుతున్నామని తెలిపారు.

రెండో నెల టీకా వేయించాక

40 గంటల్లో ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement