ఎర్రుపాలెం: ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఎం.రమేష్‌కుమార్ తెలిపిన వివరాలు... మండ లకేంద్రంలోని వైన్స్ ఎదుట రోడ్డు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తి(50)ని విజయవాడ నుంచి ఎర్రుపాలెం మండలం భీమవరానికి అతివేగంగా వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని 108లో మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపర్చగా, కుడిచేతి భుజం, కుడి మోకాలిపై పుట్టుమచ్చలు ఉన్న ఆయన ఆచూకీ తెలిసిన వారు 87126 59164(ఎస్‌ఐ) 87126 59165(పోలీస్‌స్టేషన్) నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్‌సై సూచించారు.
రైలు నుంచి జారిపడి ఒకరు..
మధిరరూరల్: వేగంగా వెళ్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడిన వ్యక్తి మృతి చెందాడు. చైన్నె నుంచి జార్ఖండ్‌కు రైలులో ప్రయాణిస్తున్న ఉజ్వల్ బండారి(44) బుధవారం తొండల గోపవరం – మధిర స్టేషన్ల మధ్య దెందుకూరు సమీపాన జారి పడ్డాడు. దీంతో ఆయన తలకు తీవ్ర గాయం కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఖమ్మం జీజీహెచ్ మార్చరీకి తరలించినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ ఎస్.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.
భర్త కళ్లముందే భార్య దుర్మరణం
నేరేడుచర్ల: భర్త కళ్ల ముందే రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో బుధవారం జరిగింది. ఎస్‌ఐ సీహెచ్.గోపాల్‌రెడ్డి తెలిపిన వివరాలు... ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన బొమ్మని వెంకన్న – సూరమ్మ(40) దంపతులు చిలక జోస్యం చెప్పుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరు బుధవారం ద్విచక్ర వాహనంపై నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుంచి సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ వైపు వెళ్తుండగా.. నేరేడుచర్ల వద్ద టిప్పర్ అతివేగంగా ఢీకొట్టింది. ఘటనలో సూరమ్మకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. ఈమేరకు ఆమె భర్త వెంకన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
టిప్పర్ ఢీకొనడంతో ప్రమాదం


