మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేయాలి

Nov 12 2026 12:19 AM | Updated on Nov 12 2026 12:19 AM

కల్లూరురూరల్‌: తుపాన్‌తో వరి పంట తడవగా, ధాన్యం రంగు మారినందున రైతులు నష్టపోకుండా పరిహారం చెల్లించడమే కాక పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే సండ్రా వెంకటవీరయ్య డిమాండ్‌ చేశారు. కల్లూరు మండలంలోని లింగాల, ఎర్ర బోయినపల్లిల్లో తుపాన్ల కారణంగా దెబ్బతిన్న పంటలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సండ్ర విలేకరులతో మాట్లాడుతూ తుపాన్లతో వేలాది ఎకరాల్లో వరి దెబ్బతిని వారం దాటినా వ్యవసాయ శాఖ సిబ్బంది ఇంతవరకు నష్టం అంచనా వేయలేదని పేర్కొన్నారు. కల్లూరు మండలంలో ఆరుగురు ఏఈఓలకు గాను ఇద్దరు సెలవులో ఉండగా, ఇద్దరు రాజీనామా చేశారని, మిగిలిన ఇద్దరితో పంటల పరిశీలన ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. తక్షణమే పంటల నష్టం అంచనా వేసి ఎకరాకు రూ. 50వేల పరిహారం చెల్లించడమే కాక తడిసి, రంగు మారిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాగా, సీజన్‌ ఆరంభంలో క్వింటా ధాన్యం రూ.4వేలకు కొనుగో లు చేసిన వ్యాపారులు కుమ్మకై ్క ప్రస్తుతం రూ.2,400కు తగ్గించారని ఆరోపించారు. అలాగే, మార్కెట్‌లో కిలో రూ.60 ఉన్న బియ్యం ధర అమాంతంగా రూ.100 చేరిందని.. మార్కెట్‌పై ప్రభుత్వానికి నియంత్రణ లేకపోవడంతోనే ఇలా జరుగుతోందని పేర్కొన్నారు. సీఎం, మంత్రులు గ్లోబల్‌ సమ్మిట్‌పై పెడుతున్న శ్రద్ధ రైతులపై కూడా పెట్టి ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు వేము కృష్ణ, పోట్రు శ్రీని వాసరావు, నాయకులు కట్ట అజయ్‌కుమార్‌, డాక్టర్‌ లక్కినేని రఘు, పెడకంటి రామకృష్ణ, దేవరపల్లి భాస్కరరావు, కొమ్మినేని నర్సింహారావు, కాటంనేని వెంకటేశ్వరరావు, రవి తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement