ఖమ్మం మార్కెట్‌కు కొత్త మిర్చి | - | Sakshi
Sakshi News home page

ఖమ్మం మార్కెట్‌కు కొత్త మిర్చి

Nov 12 2026 12:19 AM | Updated on Nov 12 2026 12:19 AM

ఖమ్మంవ్యవసాయం: ఈ ఏడాది సాగు చేసిన మిర్చి ఇప్పుడిప్పుడే చేతికి వస్తోంది. ఈమేరకు భద్రాది కొత్తగూడెం జిల్లా చర్ల మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రైతు రామకృష్ణ ఏడు బస్తాల ‘తేజా’ రకం మిర్చిని బుధవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు తీసుకొచ్చారు. సీజన్‌లో ముందుగా సాగు చేసిన పంట కోతకు వస్తుండగా, తొలి కోతను మైల కాయగా భావించే రైతులు నిల్వ చేయకుండా విక్రయిస్తారు. అంతేకాక ప్రస్తుతం మిర్చికి మంచి ధర పలుకుతుండడంతో అమ్మకానికే ముందుకొస్తున్నారు. ఈమేరకు తేజా రకం కొత్త మిర్చి క్వింటాకు రూ.21,015 ధర పలికింది.

నిల్వ మిర్చికి రూ.23వేలు

గత సీజన్‌లో సాగు చేసి, కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చి అమ్మకాలు కూడా కొనసాగుతున్నా యి. ఖమ్మం మార్కెట్‌లో బుధవారం ఈ మిర్చి క్వింటాకు గరిష్టంగా రూ.23వేలు పలకగా, మోడల్‌ ధర రూ.17,500, కనిష్ట ధర రూ.14 వేలుగా నమోదైంది. ఇళ్లలో నిల్వ చేసిన మిర్చికి మాత్రం గరిష్టంగా రూ.16 వేలు, కనిష్టంగా రూ.14 వేలుగా పలికింది. ఈ ధరలతో పోలిస్తే కొత్త మిర్చిధర ఆశాజనకంగా ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు. అయితే సంక్రాంతి తర్వాత సీజన్‌ మొదలుకానుండడంతో, దిగుబడుల ఆధారంగా ధరలు నమోదయ్యే అవకాశముంది.

క్వింటాకు రూ.21,015 ధర నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement