అగ్నిమాపక శాఖ ఉద్యోగులకు పురస్కారాలు | - | Sakshi
Sakshi News home page

అగ్నిమాపక శాఖ ఉద్యోగులకు పురస్కారాలు

Nov 12 2026 12:19 AM | Updated on Nov 12 2026 12:19 AM

సత్తుపల్లిటౌన్‌: సత్తుపల్లిలోని బేతపల్లి చెరువు వరదలో ఈనెల 4వ తేదీన చిక్కుకున్న 14 మందిని రక్షించిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, సత్తుపల్లి అగ్నిమాపక శాఖ ఉద్యోగులను శాఖ డైరెక్టర్‌ జనరల్‌ విక్రమ్‌ సింగ్‌ మాన్‌ సన్మానించారు. హైదరాబాద్‌ బుధవారం వీరిని సన్మానించిన డీజీ, పురస్కారాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. పురస్కారాలు అందుకున్న వారిలో సత్తుపల్లి ఫైర్‌ ఆఫీసర్‌ వై.వెంకటేశ్వరరావు, ఉద్యోగులు కె.బాబురావు, ఎం.వెంకటేశ్వరరావు, ఈ.రమేష్‌, మోషే బాబు, ఎం.సతీష్‌, బసవయ్య, వి.సతీష్‌, జి.రవికాంత్‌ ఉన్నారు.

రేపు అండర్‌–16

క్రికెట్‌ జట్టు ఎంపిక

ఖమ్మం స్పోర్ట్స్‌: తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌(టీసీఏ) ఆధ్వర్యంలో అండర్‌–16 క్రికెట్‌ జట్టు ఎంపిక పోటీలు శుక్రవారం నిర్వహిస్తున్నట్లు క్రికెట్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ కూరపాటి ప్రదీప్‌కుమార్‌, జి. వీరేష్‌గౌడ్‌ తెలిపారు. ఖమ్మం మధురానగర్‌ రోడ్‌ నంబర్‌ 4లోని ఎస్‌ఎస్‌ క్రికెట్‌ నెట్స్‌లో ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న క్రికెటర్లు క్రికెట్‌ కిట్‌, ఆధార్‌ కార్డు జిరాక్స్‌తో హాజరుకావాలని, వివరాలకు 98488 82551 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement