ఖమ్మం సహకారనగర్: రాజకీయ పార్టీల భాగస్వామ్యం, సమన్వయంతోనే పారదర్శకమైన ఓటర్ల తుది జాబితా సిద్ధమవుతుందని కలెక్టర్ దివాకర టీ.ఎస్ తెలిపారు. గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో బుధవారం ఆయన కలెక్టరేట్‌లో సమావేశమైన సమగ్ర ఓటర్ల సవరణ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ కేటగిరీల్లో 1,57,854 మందికి సవరణ కింద నోటీసులు జారీ చేయగా, పలువురి విచారణ కూడా పూర్తయిందని తెలిపారు. మిగతా వారి విచారణ ఈనెల 26 నాటికి పూర్తి చేసి, 30న ఓటర్ల తుది జాబితా వెలువరిస్తామని చెప్పారు. కాగా, పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికకు గాను 1,09,942 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోగా, ఇప్పటివరకు 52,163 దరఖాస్తులను ఆమోదించామని తెలిపారు. అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్, ఆర్‌డీఓ ఎన్.శ్రీనివాస్, ఎస్‌డీసీ సదానందం, ఎన్నికల విభాగం ఉద్యోగులు అన్సారీ పాల్గొన్నారు.
పకడ్బందీగా భూముల రీసర్వే
ప్రజలకు మేలు జరిగేలా భూముల రీసర్వేను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ఆయన వీసీ ద్వారా సమీక్షించగా జిల్లా నుంచి కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఈ నెలాఖరులోగా ప్రతీ జిల్లాలో తొలి విడతగా మొదలుపెట్టిన 70 గ్రామాలతో పాటు నక్షా లేని గ్రామాల్లో రీసర్వే పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. రీసర్వేలో ఎవరైనా అవకతవకలకు పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్‌డీఓ ఎన్.శ్రీనివాస్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రాజేందర్ పాల్గొన్నారు.
నిబంధనల మేరకే లేఔట్ అనుమతులు
ఖమ్మంమయూరిసెంటర్: లేఔట్ అనుమతులు జారీ చేసే సమయాన తూచా తప్పకుండా నిబంధనలు పాటించాలని కలెక్టర్ దివాకర సూచించారు. కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి లేఔట్ కమిటీ సమావేశంలో కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి 23 దరఖాస్తులను పరిశీలించి మాట్లాడారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ప్రతిపాదిత భూమి ఉందో క్షేత్రస్థాయిలో పరిశీలించడమే కాక ఇతర నిబంధనలు పాటించేలా చూడాలని చెప్పారు. పీఆర్, విద్యుత్ ఎస్‌ఈలు వెంకట్‌రెడ్డి, ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఎస్‌డీసీ సదానందం, అధికారులు వసుంధర, రాజ్కుమార్, శ్రీనివాసరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఆరుతడి పంటలే సాగుచేయండి
సత్తుపల్లిటౌన్: వర్షాభావ పరిస్థితుల నేపథ్యాన రైతులు యాసంగిలో వరి కాకుండా ఆరుతడి పంటలే సాగు చేయాలని కలెక్టర్ దివాకర సూచించారు. కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌తో కలిసి సత్తుపల్లి తామర చెరువు వద్ద వరి సాగు చేస్తున్న రైతులతో ఆయన మాట్లాడారు. చెరువుల్లోని నీటిని తాగు అవసరాలకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. చెరువులో నీరు ఉందని పంటలు వేసి, ఆ తర్వాత ఇబ్బంది పడొద్దని సూచించారు. కాగా, గుడిపాడు కాలనీకి చెందిన గిరిజన మహిళలు సాగు చేసుకుంటున్న అటవీ భూములకు పట్టాలివ్వాలని కోరగా సర్వే నిర్వహిస్తామని తెలిపారు. తొలుత బేతుపల్లిలో భూముల రీసర్వే, గంగారం 15వ బెటాలియన్‌ను కలెక్టర్ సందర్శించారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఎం.డీ.రెహనా కమల్‌పాషా, ఏడీఏ శ్రీనివాస్‌రెడ్డి, వివిధ శాఖల ఉద్యోగులు, నాయకులు శ్రీనివాస్, ప్రసాద్‌బాబు, శరత్‌బాబు, మల్లికార్జున్, చల్లగుండ్ల కష్ణయ్య, బొంతు వేణు, గాదె చెన్నారావు, నాగళ్ల నాగేశ్వరరావు, నాగళ్ల ప్రసాద్, పింగళి సామేలు, నాయుడు వెంకటేశ్వరరావు, బొంతు సూర్యనారాయణ పాల్గొన్నారు.
పార్టీల నేతలతో సమీక్షలో కలెక్టర్ దివాకర


