ఖమ్మం సహకారనగర్: విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి లలిత కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు దోహదం చేస్తాయని జిల్లా విద్యాశాఖాధికారి డి.వాసంతి తెలిపారు. ఖమ్మంలోని సైన్స్ మ్యూజియం సెమినార్ హాల్‌లో జిల్లాలోని 28 పీఎంశ్రీ పాఠశాలల విద్యార్థులకు బుధవారం జిల్లా స్థాయి ఆర్ట్ అండ్ కల్చరల్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ 28 పాఠశాలలకు చెందిన 300 మంది విద్యార్థులు పది విభాగాల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. జానపద, శాసీ్త్రయ నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారని తెలిపారు. అలాగే, ‘పుస్తక పఠనం ప్రాముఖ్యత’ అంశంపై వక్తృత్వ పోటీలే కాక కథలు చెప్పడం, కవితలు, పద్యాల పఠనం పోటీలు నిర్వహించారు. జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి పెసర ప్రభాకర్‌రెడ్డి, జ్యూరీ సభ్యులు శ్యామ్‌లాల్, ప్రవీణ్, సేవియా, శ్రావణ్, ఝాన్సీ, మనోరమ, భారతి, షఫీ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నెస్సీ పాఠశాల తనిఖీ
ఖమ్మంలోని ఎన్నెస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలను డీఈఓ వాసంతి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదుల్లో బోధన, విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ఎఫ్‌ఎల్‌ఎన్ సభ్యులు ప్రవీణ్‌కుమార్, శ్రవణ్‌కుమార్ పాల్గొన్నారు.
డీఈఓ వాసంతి


