ఖమ్మం స్పోర్ట్స్: జిల్లాస్థాయి పాఠశాలల అండర్–14 టోర్నీలో భాగంగా నిర్వహిస్తున్న వాలీబాల్ పోటీలు మంగళవారం ముగిశాయి. ఈమేరకు ఖమ్మంలోని సర్దార్‌పటేల్ స్టేడియంలో జరిగిన ఫైన ల్స్ బాలుర విభాగంలో సత్తుపల్లి – బోనకల్ జట్లు తలపడగా సత్తుపల్లి జట్టు విజయం సాధించి టైటిల్ దక్కించుకుంది. మూడో స్థానాన ఖమ్మం సౌత్ జట్టు నిలిచింది. ఇక బాలికల విభాగంలో ఖమ్మం సౌత్ జట్టు ట్రోఫీ కై వసం చేసుకోగా, మధిర, కామేపల్లి జట్లు రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి. విజేతలకు డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, ఎంఈఓ శైలజ లక్ష్మి, జిల్లా పాఠశాలల క్రీడా సంఘం కార్యదర్శి వై.చిన్ని బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీడీలు, పీఈటీలు సుధాకర్, ఆదర్శ్‌కుమార్, రంజాన్, నర్సింహారావు, పారిజాతం తదితరులు పాల్గొన్నారు.


