పరిశుభ్రంగా కనిపిస్తున్న ఎస్‌ఈ కార్యాలయ ఆవరణ
పిచ్చిమొక్కలు తొలగించాక సబ్ స్టేషన్ ఆవరణ..
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మంలోని విద్యుత్ సర్కిల్ కార్యాలయం చుట్టూనే కాక సబ్ స్టేషన్ పరిసరాల్లోపిచ్చి మొక్కలు, ముళ్ల చెట్లు ఏపుగా పెరిగి అడవిని తలపిస్తోంది. దీంతో ఉద్యోగులు, వినియోగదారులు ఇబ్బంది పడుతుండడంతో పాటు వాహనాలు పార్కింగ్ సమస్య ఎదురవుతోంది. ఈ మేరకు యంత్రాలతో కార్యాలయ ఆవరణతో పాటు సబ్ స్టేషన్ పరిసరాల్లో గిన్నె చెట్లు, మామిడి చెట్లతో నీడను ఇచ్చే చెట్లు కాకుండా పిచ్చి మొక్కలు, ముళ్ల చెట్లను తొలగించారు. ఈక్రమాన కార్యాలయ ప్రాంగణం ఇప్పుడు పరిశుభ్రంగా మారింది.


