ఎల్‌నినో నేపథ్యాన విద్యుత్ కొరత ఏర్పడే అవకాశమున్నందున విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈక్రమాన కలెక్టరేట్‌లో విద్యుత్ వినియోగంపై కలెక్టర్ దివాకర దృష్టి సారించారు. ఇందులో భాగంగా కలెక్టరేట్‌లోని కార్యాలయాలు, చాంబర్లు, సమావేశ మందిరాల్లో అవసరం లేని సమయాన లైట్లు, ఫ్యాన్లు తప్పనిసరిగా ఆఫ్ చేయాలనే సూచనలు అమల్లోకి వచ్చాయి. ఇక వెయింటింగ్ రూమ్‌లో కొద్ది మంది కూర్చోగా వారు ఉన్న చోటే లైట్లు వేసి, మిగతావి ఆఫ్ చేశారు. – ఖమ్మం సహకారనగర్


