మధిర/బోనకల్: యువత మత్తు పదార్థాలకు బానిసలైతే కుటుంబాలతో పాటు సమాజం కూడా నష్టపోతుందని జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, జిల్లా బాలల పరిరక్షణ అధికారి విష్ణువందన పేర్కొన్నారు. మధిరలో షేర్ సేవా సంస్థ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న గోల్డెన్ ఏజ్ వృద్ధాశ్రమం, బోనకల్‌లో మానసిక దివ్యాంగులకు వసతి కల్పిస్తున్న శాంతి నిలయాన్ని వారు మంగళవారం తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా షేర్ చేయూత మత్తు పదా ర్థాల పునరావాస కేంద్రంలోని బాధితులతో మాట్లాడారు. మత్తు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యం, కుటుంబ బాధ్యతలు, పిల్లల భవిష్యత్‌ను కాపాడుకోవాలని సూచించారు. బోనకల్‌లోని శాంతినిలయం తనిఖీ సందర్భంగా అక్కడ వసతులు, దివ్యాంగులకు అందుతున్న సేవలు, భోజనం సౌకర్యాలు, వైద్య సేవలపై ఆరా తీశారు. యుక్త వయస్సు పిల్లల మానసిక పరిస్థితి, వారి విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలపై చర్చించి సూచనలు చేశారు. సీడీపీఓ కృష్ణశ్రీ, ఏసీడీపీఓ షాకీరాబేగం, ఉద్యోగులు కళ్యాణి, బాబు పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్‌తో
ఆరోగ్యకరమైన సమాజం
ఖమ్మం వైద్యవిభాగం: చిన్నారులకు వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పక వ్యాక్సిన్లు వేయించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని జిల్లా వ్యాక్సిన్ మేనేజర్ సీహెచ్.రమణ పేర్కొన్నారు. వ్యాధినిరోధక టీకాల అవగాహన దినోత్సవం సందర్భంగా మంగళవారం ఖమ్మం ప్రధాన ఆస్పత్రి మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఆయన గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించారు. టీకాల ద్వారా మాతృ, శిశు మరణాలు తగ్గించవచ్చని తెలి పారు. పెద్దలకు టీడీ వ్యాక్సిన్, చిన్నారులకు బీసీజీ, హెపటైటీస్ బీ, ఓపీవీ, పీసీవీ, ఎంఆర్, పెంటా వాలెంట్ వంటి 12 రకాల ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించేందుకు పది రకాల టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. అలాగే, కేన్సర్ కట్టడికి కౌమారదశ బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని చెప్పారు. డాక్టర్ రవిచంద్ర, సునంద, సిబ్బంది పాల్గొన్నారు.


