నేలకొండపల్లి: ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని నేలకొండపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కూసుమంచి సీఐ సంజీవ్ మంగళవారం వివరాలు వెల్లడించారు. మండలంలోని చెరువుమాదారం క్రాస్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా బైక్‌పై వెళ్తున్న మధిర వాసి కె.జితేందర్ అనుమానాస్పదంగా కనిపించాడు. పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా వెంటపడి పట్టుకుని తనిఖీ చేయడంతో బ్యాగ్‌లో 54 తులాల వెండి, 13 తులాల బంగారు ఆభరణాలతో పాటు సుత్తి లభించాయి. ఆయనను విచారించగా నేలకొండపల్లి, తిరుమలాయపాలెంలో చోరీకి పాల్పడినట్లు అంగీకరించగా, గతంలో మధిర, డోర్నకల్, ఏపీలోని చిల్లకల్లు ప్రాంతాలలో చోరీలకు పాల్పడినట్లు తేలింది. నిందితుడిని అరెస్ట్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్సై పి.శ్రీనివాసరెడ్డి, ఏఎస్సై కోటేశ్వరరావు, ఉద్యోగులు ఖాసిం, హనీఫ్, శివాలాల్, సతీష్, శ్రీనివాసరావును సీఐ అభినందించారు.
54 తులాలు వెండి, 13 తులాల
బంగారం స్వాధీనం


