ఖమ్మంఅర్బన్: మానసిక ఒత్తిడితో వ్యవసాయ శాఖ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇది. కూసుమంచి మండలం నాయకులగూడెంలో ఏఈఓగా పనిచేస్తున్న వడ్డెంపుల సాయి వేదవ్యాస్(32) ఖమ్మంలోని ప్రశాంతినగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఆదివారం ఉదయం ఆయన తన నివాసంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్ప డ్డాడు. కాగా, వేదవ్యాస్ గతంలో రఘునాథపాలెం మండలంలోని రాంక్యాతండా, ఈర్లపూడి రెవెన్యూ గ్రామాల ఏఈఓగా కూడా పనిచేశారు. ఆయన తండ్రి లక్ష్మయ్య మహబూబాబాద్ జిల్లాలో ఏఎస్‌ఐగా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈమేరకు తండ్రి ఫిర్యాదుతో ఏఈఓ ఆత్మహత్యపై ఖమ్మం అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, వేదవ్యాస్ మృతిపై వ్యవసాయ శాఖ ఉద్యోగులు సంతాపం ప్రకటించారు.


