ఏ ఒక్క ఫిర్యాదు పెండింగ్‌ ఉండొద్దు.. | - | Sakshi
Sakshi News home page

ఏ ఒక్క ఫిర్యాదు పెండింగ్‌ ఉండొద్దు..

Nov 10 2026 12:19 AM | Updated on Nov 10 2026 12:19 AM

డబుల్‌ బెడ్‌రూం ఇప్పించండి

ఖేలో ఇండియా

ఆర్చరీ టోర్నీకి ఏర్పాట్లు

ఖమ్మం సహకారనగర్‌: ప్రజలు అందించిన ప్రతీ ఫిర్యాదును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ దివాకర ఆదేశించారు. ప్రజావాణిలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతిపత్రాలను స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమైన కలెక్టర్‌ మాట్లాడుతూ ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ పెండింగ్‌ లేకుండా చూడాలని తెలిపారు. అలాగే, జీఓ 59 దరఖాస్తుల పరిశీలనపై సూచనలు చేశారు. అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఫిర్యాదుల్లో కొన్ని..

● ఎల్‌నినో నేపథ్యాన థ్యంలో పంట రుణాల వడ్డీ మాఫీ చేసి రెన్యూవల్‌ చేయాలని, పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దొండపాటి రమేష్‌ ఆధ్వర్యాన వినతిపత్రం అందజేశారు.

● బోనకల్‌ మండలం మోటమర్రిలో క్వారీ నుంచి ఇసుక రవాణాకు అధికారికంగా అనుమతి మంజూరు చేయాలని సర్పంచ్‌ ఎం.సురేష్‌ కోరారు.

● పెనుబల్లి మండలం కొండ్రుపాడు జెడ్పీహెచ్‌ఎస్‌కు హిందీ బోధనకు టీచర్‌ను కేటాయించాలని ఆ గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు.

● జిల్లాలోని రైస్‌మిల్లులకు కేటాయించిన సీఎంఆర్‌ ధాన్యంలో రూ.64.63 కోట్ల విలువైన ధాన్యం తేడా ఉందనే ఆరోపణల నేపథ్యాన విచారణ జరిపించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యాన వినతిపత్రం అందజేశారు. అంతేకాక తుపాన్‌లో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కోరారు. అలాగే, తల్లాడ మండలం సిరిపురం మేజర్‌ కాల్వ పరిధి రైతులకు పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు గుత్తా వెంకటేశ్వరరావు, నరుకుళ్ల వెంకటేశ్వరరావు, మండేపూడి వీర నాగేశ్వరరావు, ఆపతి వెంకట రామారావు తదితరులు పాల్గొన్నారు.

పేదరికంలో ఉన్న తమకు డబుల్‌ బెడ్‌రూం ఇల్లు ఇప్పించాలని కలెక్టర్‌ను కలిశాం. మాకు ఇద్దరు పిల్లల్లో ఆరేళ్ల పెద్దకుమార్తె యశస్వి దివ్యాంగురాలు. కూలీ పనులతో జీవనం సాగిస్తున్న తమకు ఇంటి అద్దె భారం మారింది. దీంతో డబుల్‌ బెడ్‌రూం ఇల్లు ఇప్పించాలని కోరాం.

– గుగులోతు రమేష్‌ – శరణ్య, వేపకుంట్ల

ఖమ్మం స్పోర్ట్స్‌: ఖేలో ఇండియా పోటీల్లో భాగంగా ఆర్చరీ టోర్నీని జిల్లాకు కేటాయించినందున పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. సూచించారు. ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో వచ్చేనెల 17 నుంచి నాలుగు రోజులు జరుగుతుందని, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులకు ఇబ్బంది ఎదురుకాకుండా ఏర్పాట్లు ఉండాలని తెలిపారు. ఖేలో ఇండియా పోటీలపై అదనపు కలెక్టర్‌ పి.శ్రీజతో కలిసి ఆయన అధికారులతో సమీక్షించారు. పోటీల నిర్వహణపై ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. టోర్నీ కోసం క్రీడాకారులు, సిబ్బంది 134 మంది రానున్నందున వసతి, రవాణా ఏర్పాట్లు చేయాలని, స్టేడియంలో తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్‌ సరఫరా, వైద్యసాయంపై దృష్టి సారించాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ రామానుజం, జిల్లా క్రీడా, రవాణా, అగ్నిమాపక, టూరిజం శాఖల అధికారులు సునీల్‌రెడ్డి, జగదీష్‌, బి.అజయ్‌కుమార్‌, సుమన్‌ చక్రవర్తి, కేఎంసీ ఎస్‌ఈ వి.రంజిత్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

గ్రీవెన్స్‌ డేలో కలెక్టర్‌ దివాకర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement