ధాన్యం కొనాలంటూ ధర్నా | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనాలంటూ ధర్నా

Nov 10 2026 12:19 AM | Updated on Nov 10 2026 12:19 AM

నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురంలోని అరుణాచలం రైస్‌ మిల్లు వద్ద ఆదివారం నాయకులు, రైతులు ఆందోళనకు దిగారు. కొన్నాళ్ల క్రితం వరకు ధాన్యం కొనుగోలు చేసిన మిల్లు నిర్వాహకులు, ఇప్పుడు బీపీటీ తప్ప ఇతర రకాలు కొనకపోవడంతో ధర్నా చేశారు. మోటాపురం, చెన్నారం, రాజేశ్వరపురం, అమ్మగూడెం, జక్కేపల్లి తదితర గ్రామాల రైతులు రావడంతో తొలుత యజమాన్యంతో చర్చించినా ససేమిరా అన్నారు. దీంతో రైతులు మిల్లు ప్రధాన గేట్‌కు తాళాలు వేసి ధర్నాకు దిగారు. అన్ని రకాల ధాన్యం సేకరించాలని, లేకపోతే మిల్లు మూసేయాలని డిమాండ్‌ చేశారు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి మిల్లు బాద్యులతో చర్చిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.

చెరుకు టన్నుకు రూ.4,200 ఇవ్వాల్సిందే...

మండలంలో చెరుకు సాగు చేసిన రైతులకు టన్నుకు రూ.4,200 చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు రాజేశ్వరపురంలో ధర్నా చేయగా, వారు మాట్లాడుతూ పెట్టుబడి, కూలీల ఖర్చులు పెరిగినందున మధుకాన్‌ యాజమాన్యం ప్రకటించిన రూ.3,800 కాకుండా టన్నుకు రూ.4,200 చెల్లించాలని కోరారు. అలాగే, ధాన్యం తరహాలోనే చెరుకు రైతులకు కూడా టన్నుకు రూ.700 బోనస్‌ ఇవ్వాలని పలువురు రైతులు మంత్రి పొంగులేటికి వినతిప్రతం అందజేశారు. ఈ కార్యక్రమాల్లో రైతు ప్రతినిధులు, సర్పంచ్‌లు దండా రంగయ్య, ఏలూరి రామారావు, నర్సింహారావు, పుసులూరి వాసు, చింతనిప్పు సైదులు, తాళ్లూరి రవి, ఇంటూరి అశోక్‌, రామారావు, యలమద్ది లెనిన్‌, హన్మంతు, పి.వీరయ్య, రామస్వామి, చాగంటి మధు, మస్తాన్‌, రామారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement