ఏన్కూరు: మహిళలు ఆర్థికంగా ఎదిగేలా ప్రభుత్వం బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు మంజూరు చేయిస్తోంది. అయితే, సభ్యుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారు చెల్లించే రుణ వాయిదాలను కొందరు గ్రామదీపికలు సొంతానికి వాడుకుంటున్నారు. ఈక్రమాన ఏన్కూరులోనూ ఇలాంటి ఘటన బయటపడింది. మండలంలో సీ్త్రనిధి రుణ లావాదేవీలను సోమవారం ఏన్కూరులో ఆడిట్ బృందం తనిఖీ చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన గ్రామసభలో పలు సంఘాల సభ్యులు బకాయి ఉన్నట్లు తేల్చారు. కానీ తాము క్రమం తప్పక చెల్లిస్తున్నామని సభ్యులు చెప్పడంతో ఆరా తీయగా సభ్యులు చెల్లించిన రూ.36లక్షలను గ్రామదీపిక సులోచన ఖాతాల్లో జమ చేయకుండా సొంతానికి వాడుకున్నట్లు బయటపడింది. 2019 సంవత్సరం నుండి ఇప్పటివరకు 30 సంఘాల్లోని 125 మంది సభ్యుల సొమ్ము పక్కదారి పట్టడంతో, ఆ నగదు తిరిగి చెల్లిస్తానని గ్రామదీపిక సులోచన లేఖ రాసి ఇచ్చింది. ఎంపీడీఓ పల్లి భాగ్యశ్రీ, సీ్త్రనిధి అసిస్టెంట్ మేనేజర్ వేణుగోపాలాచారి, ఏపీఎం శ్యామ్‌కుమార్ పాల్గొన్నారు.


