ఖమ్మంక్రైం: ఖమ్మం శ్రీనివాసనగర్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం సాగుతోందనే సమాచారంతో శుక్రవారం రాత్రి ఏహెచ్‌టీయూ, షీ టీమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముగ్గురు బాధిత మహిళలతోపాటు ముగ్గురు విటులు, నిర్వాహకులను గుర్తించారు. నిందితులను ఖమ్మం త్రీటౌన్ పోలీసు స్టేషన్‌లో అప్పగించినట్లు తెలిపారు.
48 క్వార్టర్ల మద్యం స్వాధీనం
నేలకొండపల్లి: మండలంలోని మంగాపురం తండాలో కల్తీ మద్యం అమ్ముతున్నారనే సమాచారం మేరకు శనివారం ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీ చేపట్టారు. గ్రామానికి చెందిన ధీరావత్ కోటేశ్వరరావు ఈ అంశంపై ఫిర్యాదు చేయగా ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తనిఖీలకు ఆదేశించారు. దీంతో పలుచోట్ల తనిఖీ చేయగా ఓ మహిళ వద్ద సూర్యాపేట జిల్లా వైన్స్ నుంచి తీసుకొచ్చిన 48 క్వార్టర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఆమైపె కేసు నమోదు చేయడమే కాక, పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించినట్లు సీఐ వేమిరెడ్డి రమ్య తెలిపారు.
జనావాసాల్లోకి భారీ కొండచిలువ..
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి కృషి బైపాస్ రోడ్డులోని ముళ్ల తీగల ఫ్యాక్టరీ రోడ్డు పరిసరాల్లో 12 అడుగుల భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. మూడు నెలల క్రితం ఈ ప్రాంతంలోని కొండచిలువ సంచరిస్తోందని ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, మున్సిపల్ చైర్‌పర్సన్ రెహానా కమల్‌పాషా దృష్టికి తీసుకెళ్లగా.. జేసీబీతో పొదలు, ముళ్లచెట్లను తొలగించారు. మళ్లీ అదే ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి కొండచిలువ కనిపించగా స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే అబ్దుల్ ఇంట్లోకి చొరబడిన కొండచిలువను ఎఫ్‌ఎస్‌ఓ కోటేశ్వరరావు, ఎఫ్‌బీఓ అబీద్, రిటైర్డ్ మహమ్మూద్, సిబ్బంది బాబూరావు, నర్సింహారావు బంధించారు. దీనిని కొమ్మేపల్లి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టినట్టు రేంజర్ ఎల్లయ్య తెలిపారు.


