ఖమ్మంఅర్బన్: హ్యుందాయ్ కంపెనీ నూతనంగా రూపొందించిన బేయాన్ ఎస్‌యూవీ కారును శనివారం ఖమ్మం మార్కెట్‌లోకి విడుదల చేశారు. భారత్ హ్యుందాయ్ షోరూంలో కారును జిల్లా రవాణా శాఖాధికారి డి.జగదీష్ ఆవిష్కరించారు. అనంతరం సీఈఓ శయన్‌కృష్ణ మాట్లాడుతూ జనరేటివ్ ఏఐ ఆధారిత వాయిస్ అసిస్టెంట్, లెవల్–2 ఏడీఏఎస్, 360 డిగ్రీల కెమెరా, పార్కింగ్ సెన్సార్లు వంటి అధునాతన సదుపాయాలు ఈ కారులో ఉన్నాయని తెలిపారు. ప్రారంభ ధర రూ.9,99,900 వద్ద మొదలవుతుందని పేర్కొన్నారు. భారత్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్రబోస్, సేల్స్ మేనేజర్ కె.సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చెరుకు టన్ను ధర రూ.3,800
నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురంలోని మధుకాన్ షుగర్ ఫ్యాక్టరీలో ఈ సీజన్‌కు చెరుకు టన్నుధర రూ.3,800గా నిర్ణయించినట్లు ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ నామా కృష్ణయ్య తెలిపారు. ఫ్యాక్టరీ వద్ద శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2026–27 సీజన్‌లో గానుగకు ఈనెల 16న ముహూర్తంగా నిర్ణయించగా, 19నుంచి ప్రారంభిస్తామని తెలి పారు. గత రెండేళ్లుగా కర్మాగారంలో గానుగకు తక్కువ మొత్తంలో చెరుకు వస్తున్నందున, సాగు విస్తీర్ణం పెంచేందుకు రైతులు కృషిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఏవీపీ కోటయ్య, డీజీఎం అప్పారావు, ఏజీఎం నరేష్, సర్పంచ్‌లు దండా రంగయ్య, ఏలూరి రామారావు, సొసైటీ చైర్మన్ తన్నీరు కృష్ణమూర్తితో పాటు యాసా విష్ణువర్దన్‌రెడ్డి, నెల్లూరి భద్రయ్య, సూరపనేని రామకృష్ణ, మల్లయ్య, చింతనిప్పు సైదులు, పుసులూరి వాసు, యలమద్ది లెనిన్ పాల్గొన్నారు.


