వైరా: అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థినులు 62మంది గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పలు గ్రామాల్లో రైతులతో మమేకమవుతూ సాగులో సలహాలు ఇస్తున్నారు. ఈక్రమాన వైరా కేవీకేలో శనివారం నిర్వహించిన రైతు సదస్సులో వారు వ్యవసాయ సంబంధిత అంశాలపై ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సదస్సును జిల్లా వ్యవసాయ శాఖాధి కారి ధనసరి పుల్లయ్య పరిశీలించి మాట్లాడారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యాన రైతులు యాసంగిలో తక్కువ నీరు అవసరమయ్యే పంటలు సాగు చేయాలని సూచించారు. ఆత్మ పీడీ సరిత, అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్‌కుమార్, శాస్త్రవేత్తలు మాట్లాడగా ఏఓలు మయాన్ మంజుఖాన్, వేణు, అస్టిస్టెంట్ ప్రొఫెసర్లు శివ, కె.శిరీష, కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ పావని, డాక్టర్ ఫణిశ్రీ పాల్గొన్నారు.


