వైరా: ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకోవడం, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించేలా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం వైరా మండల పూర్వ గౌరవ అధ్యక్షుడు కొత్త జగన్నాథరావు ముందుకొచ్చారు. ఈమేరకు వైరా ప్రభుత్వ ఉన్నత పాఠశాల పేరిట శనివారం రూ.లక్ష డిపాజిట్ చేసి పత్రాలను అందజేశారు. ఈ నగదుపై వచ్చే వడ్డీతో ఏటా పదో తరగతి ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించే విద్యార్థులకు నగదు బహుమలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం వనమా సీతారామారావుతో పాటు ఉపాధ్యాయులు, నాయకులు పైడిపల్లి సత్యనారాయణ, టీ.వీ.కృష్ణయ్య సూరి, సామినేని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


